నకిలీ మావోలకు పోలీసులు చెక్

by  |
నకిలీ మావోలకు పోలీసులు చెక్
X

దిశ, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో నకిలీ మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్నాల వీధిలో నివాసముండే గుట్కా వ్యాపారి సురేష్ ఇంటికి ఇద్దరు వ్యక్తులు తుపాకులతో వెళ్లి మావోయస్టు పార్టీ ఫండ్ ఇవ్వాలని బెదిరించారు. దీంతో వ్యాపారి సురేష్ భయపడి కేకలు వేయడంతో నకిలీ మావోలు పారిపోయే ప్రయత్నం చేశారు. సురేష్ కేకలకు వచ్చిన స్థానికులు ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు పాలకొండ ఎస్‌డీపీవో శ్రావణి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఎస్‌డీపీవో శ్రావణి మాట్లాడుతూ.. ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఏడుగురు నకిలీ మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని అన్నారు. వీరి నుంచి ఐదు నాటు తుపాకులు, ఒక ట్యాబ్, మావోయిస్టుల దుస్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నకిలీ మావోలపై గతంలో నేర చరిత్ర ఉన్నట్లు చెప్పారు. ఒరిస్సా రాష్ట్రంలోని కాశీనగరంలో ఒక రైస్ మిల్లర్ ను బెదిరించి డబ్బులు కాజేశారని, కొత్తూరులో కూడా వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు కాజేసినట్లు కేసులు ఉన్నాయని వెల్లడించారు. నకిలీ మావోల పేరుతో డబ్బులు వసూలు పాల్పడితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో SDPOతో పాటు పాలకొండ సీఐ శంకర్‌రావు, వీరఘట్టం ఎస్ఐ జి.భాస్కర్ రావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



Next Story