దిశ చట్టం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి.. ఏమన్నారంటే ?

by  |
kollu ravindra
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. మహిళలపై అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయంటూ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. వైసీపీ నేతల అరాచకాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య జరిగి 21 రోజులు గడుస్తున్నా ఇంత వరకు న్యాయం జరగలేదని ఎద్దేవా చేశారు. అమలులో లేని దిశ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

దిశ చట్టం ద్వారా ఇప్పటి వరకు ముగ్గురికి ఉరిశిక్ష పడేలా చేశామని హోంమంత్రి సుచరిత వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఉరివేయబడ్డ వ్యక్తులు ఎవరో చెప్పాలని సవాల్ విసిరారు. మరోవైపు రాష్ట్ర పోలీస్ వ్యవస్థపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయిందని ధ్వజమెత్తారు. డీజీపీ సహా చాలా మంది పోలీసు అధికారులు వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా సీఎం జగన్‌కు తొత్తులుగా వ్యవహరించడాన్ని పోలీసులు మానుకోవాలని.. లేకపోతే ప్రజలు ఏదో ఒకరోజు తిరగబడతారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Next Story

Most Viewed