‘న్యాయసేవ అధికార సంస్థ ద్వారా వారికి ఉచితంగా వకీలును పెట్టుకునే హక్క ఉంది ’

by  |
‘న్యాయసేవ అధికార సంస్థ ద్వారా వారికి ఉచితంగా వకీలును పెట్టుకునే హక్క ఉంది ’
X

దిశ సిద్దిపేట: ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలని, న్యాయపరమైన అవగాహన ప్రతి గ్రామాన్ని చేరేలా, పేదప్రజలకు సైతం సామాన్యులకు క్వాలిటీ లీగల్ ఎయిడ్ అందేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎ. అభిషేక్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ న్యాయసేవా అధికార సంస్థ ప్రారంభమై 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని, సిల్వర్‌ జూబ్లీ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో భాగంగా శనివారం లీగల్‌ సర్వీసెస్‌ మెగా క్యాంపును జిల్లా కేంద్రమైన సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు (లీగల్ సర్వీసెస్ మాడ్యుల్ క్యాంపు) జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎ. అభిషేక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయ విజ్ఞాన సదస్సు ముఖ్య ఉద్దేశం న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందడంపై అవగాహన కల్పించడం అన్నారు. న్యాయంను ధిక్కరించే అధికారం ఎవ్వరికి లేదన్నారు. పేద ప్రజలకు లీగల్ రైట్స్ పై అవగాహన కల్పించేందుకు , ఉచిత న్యాయ సహాయం అందించేందుకు వీలుగా జాతీయ ,రాష్ట్ర , జిల్లా స్థాయిలో న్యాయ సేవా ప్రాధికార సంస్థ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి ఈ న్యాయ సహాయం అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. న్యాయవాదులు నాణ్యమైన, శ్రేష్టమైన ఉచిత న్యాయ సహాయాన్ని పేదవారికి న్యాయసేవాధికార సంస్థ ద్వారా అందించాలని ఆయన కోరారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ బి పాపిరెడ్డి మాట్లాడుతూ .. దేశంలోని ప్రతి మహిళకు, ప్రతి ఎస్సీ, ఎస్టీలకు కార్మికులకు, దివ్యాంగులకు న్యాయసేవ అధికార సంస్థ ద్వారా ఉచితంగా వకీలును పెట్టుకునే హక్కు వారికి ఉంటుందని ఆమె సూచించారు. 1987 ఆర్టికల్‌39(ఎ) ద్వారా ప్రతిఒక్కరికి న్యా యం పొందే హక్కును కల్పించిందని, ఇది పూర్తి స్థాయి‌లో అమలు కాకపోవడంతో 1995లో న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేసిందన్నారు. ఇది పూర్తి స్థాయి లో అమలు కాకపోవడంతో 1995లో న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేశారని ఆమె గుర్తు చేశారు. సమీప మండల, జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, ప్రతి జిల్లాలో న్యా‌య సేవాధికార సంస్థ కార్యాలయం ఉంటుందని, టోల్‌ ఫ్రీ నెంబర్‌ 15100 ద్వారా సేవలు అందుబాటులో ఉం టాయన్నారు. వంద క్రిమినల్‌ కేసులు కోర్టుకు వస్తే పేదలు అందులో కనీసం ఒక్కదాంట్లోనైనా న్యాయం పొందలేకపోతున్నారని దీనికి ప్రధాన కారణం, వారికి చట్టాలపై అవగాహన లేకపోవడమేనని అన్నారు. ఆ

Next Story

Most Viewed