‘వైద్య ఉత్పత్తులపై పన్ను ఎత్తివేయాలి’

by  |
‘వైద్య ఉత్పత్తులపై పన్ను ఎత్తివేయాలి’
X

హైదరాబాద్: రాష్ట్రం, దేశంలో తయారవుతున్న, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఔషధాలు, వైద్య పరికరాలపై కస్టమ్స్, ట్యాక్స్ ఎత్తివేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డా.హర్షవర్ధన్ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌లో ఈటల మాట్లాడుతూ.. వెంటిలేటర్‌లు, ఇతర వైద్య పరికరాలను ఈసీఐఎల్, డీఆర్డీవో లాంటి సంస్థల్లో తయారుచేయించి, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయాలని సూచించారు. ఎన్-95 మాస్కులు, పీపీఈ, టెస్టింగ్ కిట్స్ సాధ్యమైనంత త్వరగా పంపించాలని కోరారు. వైద్య పరికరాలు, కరోనా నివారణకు ఉపయోగిస్తున్న వాటిని బ్లాక్ మార్కెట్ చేయకుండా నియంత్రించాలని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరగలేదనీ, ఇక్కడ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 85శాతం మర్కజ్ నుండి వచ్చినవేననీ, ఇవి తగ్గితే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని వివరించారు.

అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8,500 మందికి కరోనా పరీక్షలు జరుపగా, 471మందికి పాజిటివ్ వచ్చిందనీ, వీరిలో 45 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, 12 మంది మృతి చెందారని వెల్లడించారు. లాక్ డౌన్ పొడిగించే అంశంపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు.

Tags: etela rajender, health minister, central minister harshvardhan, corona, video conference, Tax waive on medical products, customs duty,



Next Story