జూనియర్ డాక్టర్ల తీరు సరికాదు : మంత్రి ఈటెల

by  |
జూనియర్ డాక్టర్ల తీరు సరికాదు : మంత్రి ఈటెల
X

దిశ, హైదరాబాద్:

”కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా యుద్ధప్రాతిపదికన తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. కరోనా మీద మనం విజయం సాధించాం. ప్రభుత్వం ఇంతగా ప్రాధాన్యత తీసుకుంటే గాంధీ ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్లు మాత్రం చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ పేషెంట్‌ను, ఆ వార్డును షిప్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారి ఆలోచన సరైంది కాదు. అందుకే వారిని గట్టిగా మందలించాను” అని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం అనంతరం ఆయన మీడియా లాబీలో పాత్రికేయులతో చిట్‌చాట్ చేస్తూ కరోనా పట్ల ప్రజల్లో అప్రమత్తతతో పాటు భయాలు కూడా ఉన్నాయని అన్నారు. అందుకే తనను కూడా ఇంట్లోకి వెళ్ళేముందు తప్పనిసరిగా స్నానం చేసి రావాల్సిందిగా కుటుంబ సభ్యులు వత్తిడి చేస్తున్నారని గుర్తుచేశారు.

అన్ని రంగాలపై కరోనా ఎఫెక్ట్ ఉందని, పౌల్ట్రీ రంగం మీద కూడా గణనీయంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో పౌల్ట్రీ రంగానికి దాదాపు వెయ్యి కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. తనకు కూడా పౌల్ట్రీ ఉందని, సుమారు ఎనిమిది కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని అన్నారు.

Tags : Telangana, Assembly, Health Minister, Eatala Rajender, Corona, Gandhi Hospital, Chit-chat

Next Story

Most Viewed