ఈటల ప్రాణాలను సైతం లెక్కచేయలేదు : ఈటల జమున

by  |
Eatala-Jamuna
X

దిశ, కమలాపూర్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి.. ప్రతీ ఒక్కరిని కదిలించి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన నాయకుడు ఈటల రాజేందర్ అని ఈటల జమున అన్నారు. శనివారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లి, వంగపల్లి, మర్రిపల్లి, మర్రిపల్లిగూడెం గ్రామంలో జమున పర్యటించారు.

ఈ సందర్భంగా ఈటల జమున మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నింపిన వ్యక్తి ఈటల రాజేందర్ అని, ఆయన ఎటువంటి వ్యక్తి అనేది గత 20 సంవత్సరాలుగా తెలంగాణ, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు చూశారని అన్నారు. తెలంగాణలో రైతులు కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వమే కొనాలని చెప్పిన వ్యక్తి ఈటల అని తెలిపారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా తన ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందించిన సేవకుడని పేర్కొన్నారు.

అటువంటి వ్యక్తి ఎక్కడ రాజకీయంగా ఎదుగుతాడోనని.. లేనిపోని భూ ఆరోపణలు, కుట్రలు చేసి, రాత్రికి రాత్రే బర్తరఫ్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పని చేసామని.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా, ఆర్థికంగా ప్రలోభాలకు గురిచేసినా వెళ్లలేదని.. రాజకీయాలకు రాక ముందే మాకు ఆస్తులున్నాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం కోసం, ఉద్యమం కోసం మా సొంత ఆస్తి కూడా అమ్ముకున్నామనీ చెప్పారు. ఈటల రాజేందర్ ప్రజల గుండెల్లో ఉన్నాడని.. ఈ నియోజకవర్గ ప్రజలు అత్యంత మెజార్టీతో ఆయన్ను గెలిపించాలని కోరారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed