నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎర్రబెల్లి

by  |
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎర్రబెల్లి
X

దిశ, వరంగల్: కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించినందున ఈ ఆప‌త్కాలంలో అంద‌రం క‌లిసిక‌ట్టుగా నడవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తి మండ‌లంలోని పలు గ్రామాల్లో నిరుపేద‌ల‌కు ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో మంత్రి నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఓ వైపు ఆర్థిక మాంద్యం, మ‌రోవైపు క‌రోనా స‌మ‌స్య‌ నెల‌కొందన్నారు. అయినా, సీఎం కేసీఆర్ మాత్రం ప్ర‌జ‌ల ప్రాణాలే ముఖ్య‌మంటున్నారని చెప్పారు. ఓ పూట పస్తులుండైనా సరే ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడాల‌నే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. ఇలాంటి స‌మ‌యంలోనే మ‌న‌మంతా ఏక‌తాటిపైకొచ్చి లాక్‌డౌన్‌ని ప‌క‌డ్బందీగా పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.

Tags: Errabelli trust, Dayakar Rao, supplies, essential goods, warangal


Next Story