ట్వీట్స్ దుమారం.. యువ క్రికెటర్‌ను సస్పెండ్ చేసిన క్రికెట్ బోర్డు

by  |
ట్వీట్స్ దుమారం.. యువ క్రికెటర్‌ను సస్పెండ్ చేసిన క్రికెట్ బోర్డు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన యువ ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్‌‌ని ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. అయితే, రాబిన్సన్.. 2012-2013లో చేసిన జాత్యాహంకార, అసభ్యకర ట్వీట్‌లను కారణంగా చూపుతూ ఈసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

విషయం ఏంటంటే.. కంట్రీ క్రికెట్ క్లబ్‌లో ససెక్స్ టీమ్‌కి ఆడిన రాబిన్సన్.. ఒకానొక సమయంలో మితిమీరిన జాత్యాహంకార, వివాదాస్పదమైన ట్వీట్స్ చేసినట్లు తేలింది. ఈ క్రమంలో.. ఇంగ్లాండ్, కివీస్ మధ్య మ్యాచ్‌ జరుగుతుండగానే ఈసీబీ అతని ట్వీట్స్‌పై విచారణ కోసం ఓ కమిటీని నియమించింది. పాత ట్వీట్‌లపై వివాదం చెలరేగడంతో రాబిన్సన్ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ ఈసీబీ విచారణకి ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీని నియమించే ముందు జాత్యాహంకార వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్టు ఈసీబీ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే రాబిన్సన్‌‌ని ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది.



Next Story