సూర్య అరంగేట్రం అదుర్స్: ఇంగ్లాండ్ టార్గెట్ 186

by  |
సూర్య అరంగేట్రం అదుర్స్: ఇంగ్లాండ్ టార్గెట్ 186
X

దిశ, వెబ్‌డెస్క్: నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టీ-20 మ్యాచ్‌లో భారత జట్టు మంచి ఇన్నింగ్స్ ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్ (12), కేఎల్ రాహుల్ (14) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. ఇక టూ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కోహ్లీ సైతం 1 పరుగుకే చేతిలెత్తేశాడు.

ఇటువంటి సమయంలో తొలి సారి అంతర్జాతీయ టీ-20లో అరంగేట్రం చేసిన సూర్య కుమార్ యాదవ్ జట్టుకు అండగా నిలిచాడు. డేరింగ్ బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 57 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, 14వ ఓవర్‌లో సామ్ కర్రన్ వేసిన రెండో బంతిని భారీ షాట్ ఆడబోయి డేవిడ్ మలన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 110 పరుగులకు టీమిండియా నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (30), శ్రేయస్ అయ్యర్ (37) పరుగులతో స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. మిడిలార్డర్‌లో వచ్చిన హర్దిక్ పాండ్యా (11), వాషింగ్టన్ సుందర్ (4) పేలవ ప్రదర్శన కనబరిచారు. ఇక చివర్లో వచ్చిన షార్దుల్ ఠాకూర్ 10 నాటౌట్, భువనేశ్వర్ కుమార్ 0 క్రీజులో ఉండగానే ఓవర్లు ముగిశాయి. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది.

Next Story