ఆ సర్వీసును అందరికీ ఇవ్వబోతున్న జూమ్!

by  |
ఆ సర్వీసును అందరికీ ఇవ్వబోతున్న జూమ్!
X

గతంలో వీడియో కాల్ సర్వీసింగ్ యాప్ ‘జూమ్’ తమ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సేవలను కేవలం పెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే వ్యక్తిగత గోప్యతకు ప్రాముఖ్యత పెరుగుతున్న క్రమంలో ఆ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సభ్యులు, ఇతర వినియోగదారుల వ్యతిరేకత నేపథ్యంలో ఈ ఎన్‌క్రిప్షన్ సేవలను పెయిడ్ యూజర్లతో పాటు ఉచిత వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం వినియోగదారులు తమ ఫోన్ నెంబర్‌ను వెరిఫై చేసుకుంటే సరిపోతుందని జూమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎరిక్ యువాన్ బుధవారం బ్లాగు పోస్టులో తెలిపారు.

‘ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్’ ద్వారా ఇద్దరు వినియోగదారుల మధ్య సంభాషణలు మూడో వ్యక్తి తెలుసుకోలేరు. తమ ప్లాట్‌ఫాం వినియోగిస్తున్న ప్రతి ఒక్కరికి వ్యక్తిగత గోప్యత అనేది ఒక హక్కుగా లభించాలన్నా ఉద్దేశంతో తాము గత నిర్ణయాన్ని మార్చుకుని అందరికీ ఎన్‌క్రిప్షన్ సేవను అందజేస్తున్నట్లు ఎరిక్ యువాన్ పేర్కొన్నారు. జూమ్ గత నిర్ణయానికి వ్యతిరేకంగా 70 వేల మంది వినియోగదారులు రెండు పిటిషన్లు వేశారు. ప్రీమియం సభ్యత్వాన్ని కొనుగోలు చేయలేని వారికి సైబర్ సేఫ్టీ హక్కు ఉందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూమ్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ కారణంగా జూమ్‌ను అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నవారిని ట్రాక్ చేయడం కొద్దిగా కష్టమవుతుందనే ఉద్దేశంతో ఈ సర్వీసును ప్రీమియం యూజర్లకే పరిమితం చేసినట్లు జూమ్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed