ప్లాస్మా థెరపీ ఫలితాన్నిస్తోంది: కేజ్రీవాల్

by  |
ప్లాస్మా థెరపీ ఫలితాన్నిస్తోంది: కేజ్రీవాల్
X

న్యూఢిల్లీ: కరోనా రోగులకు చివరి ప్రయత్నంగా అందిస్తున్న ప్లాస్మా థెరపీ ఆశాజనకమైన ఫలితాలనిస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఆయన వైద్య నిపుణులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా నలుగురు కరోనా రోగులకు ఢిల్లీ ప్రభుత్వం ప్లాస్మా థెరపీ చేయించగా, మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. వీరిలో ఇద్దరు పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్లాస్మా చికిత్సకు ముందు వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండేదనీ, దీంతో వైద్యులు అతన్ని వెంటిలేటర్‌పై ఉంచారని గుర్తు చేశారు. కానీ, ప్లాస్మా థెరపీ అనంతరం అతని ఆరోగ్యం మెరుగుపడటంతో వెంటిలేటర్ తొలగించారని చెప్పారు. ఇలాగే, మరికొందరికి ట్రయల్స్ నిర్వహించిన అనంతరం పెద్ద ఎత్తున ప్లాస్మా చికిత్స అందించేలా అనుమతినివ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్టు తెలిపారు. కావున కరోనా నుంచి కోలుకున్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అయితే, ప్లాస్మా చికిత్స అనేది కేవలం ఓ ఆశాకిరణం లాంటదేననీ, ఇంతమాత్రానా కరోనా నివారణకు మందు దొరికిందని భావించొద్దని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Tags: plasma therapy, coronavirus, arvind kejriwal, delhi cm, covid 19


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed