పంచాయతీ పాలనలో సర్పంచ్ భర్త పెత్తనం… పట్టించుకోరేంటి…?

by  |
పంచాయతీ పాలనలో సర్పంచ్ భర్త పెత్తనం… పట్టించుకోరేంటి…?
X

దిశ, భద్రాచలం : గ్రామ పంచాయతీ పాలనలో సర్పంచ్ భర్త పెతనం చేయడంతో గ్రామంపంచాయతీ కార్మికులు నిరసనకు దిగారు. గ్రామపంచాయతీ సర్పంచ్ నూపా సుమిత్ర పంచాయతీ ట్రాక్టర్‌ని సొంతపనులకు ఉపయోగించుకుంటున్నారని, ఇదేమిటని అడిగిన కార్మికులపై సర్పంచ్ వేధింపులకు పాల్పడుతున్నారని, సర్పంచ్ భర్త సీతయ్య పంచాయతీ పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమే గాకుండా సిబ్బందిపై పెత్తనం చేస్తున్నారని ఆరోపిస్తూ, సీఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. సర్పంచ్, ఆమె భర్త వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.

పంచాయతీ ట్రాక్టర్ సొంత పనులకు వాడకుండా దానిని పంచాయతీ ఆఫీసులోనే ఉంచాలని, సర్పంచ్ భర్త పెత్తనాన్ని నిరోధించాలని, కార్మికులపై సర్పంచ్ కక్షపూరిత వైఖరి మానుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికుల పక్షాన మండల పంచాయతీ అధికారికి సీఐటియు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనకి నాయకత్వం వహించిన సీఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కొలగాని బ్రహ్మాచారి మాట్లాడుతూ కార్మికుల ఇబ్బందులను ఎంపివో దృష్టికి తీసుకెళ్ళామని తెలిపారు. ఇప్పటికైనా సర్పంచ్, ఆమె భర్త ఇద్దరు తమ వైఖరి మార్చుకోవాలని కోరారు. వారిపై విచారించి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.



Next Story

Most Viewed