ఇమామీ లాభం రూ. 144.44 కోట్లు!

by  |
ఇమామీ లాభం రూ. 144.44 కోట్లు!
X

దేశీయ ఎఫ్ఎమ్‌సీజీ పరిశ్రమల్లో ప్రధాన సంస్థ ఇమామీ మూడవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 5 శాతం పెరిగి రూ. 144.44 కోట్లుగా నమోదైంది. స్థూల మార్జిన్‌లు, వ్యయ నియంత్రణ చర్యలు నికర ఆదాయం పెరుగుదలకు సహాయపడిందని సంస్థ తెలిపింది. గతేడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రూ. 137.54 కోట్లుగా నమోదైంది. సమీక్షించిన త్రైమాసికంలో మొత్తం ఆదాయం 1.02 శాతానికి పెరిగి రూ. 828.22 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో రూ. 819.83 కోట్లుగా నమోదైందని సంస్థ వెల్లడించింది.

దేశీయంగా బలహీనమైన వినియోగ సామర్థ్యం, గ్రామీణ డిమాండ్, ఆహార ద్రవ్యోల్బణం పెరగడం వంటి సవాళ్లను ఎదుర్కొని ఈ త్రైమాసికంలో సంస్థ వృద్ధిని నమోదు చేసిందని ఇమామి సంస్థ ప్రకటించింది. శీతాకాలం వాతావరణ మార్పుల కారణంగా ఆర్థిక సంవత్సరం 2019-20 మూడో త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం రూ. 813 కోట్లుగా నమోదైనట్టు సంస్థ పేర్కొంది. ముడిసరుకుల ఖర్చులు తక్కువగా ఉండటంతో సంస్థ స్థూల మార్జిన్‌లు పెరగడానికి సహాయపడ్డాయి. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యయ నియంత్రణ చర్యలు రాబోయే త్రైమాసికంలో లాభాలను తెచ్చి పెడుతుందని ఇమామి డైరెక్టర్ హర్ష అగర్వాల్ చెప్పారు. ఇమామి సంస్థ వ్యయం మూడవ త్రైమాసికంలో రూ. 544.62 ఉండగా ఈసారి రూ. 547.67 కోట్లతో స్వల్పంగా పెరిగిందని వెల్లడించారు. ఇమామి లిమిటెడ్ షేర్లు శుక్రవారం రూ. 300.01 వద్ద ట్రేడవుతోంది. గురువారంతో పోల్చితే ఇది 0.95 శాతం తగ్గింది.

Next Story

Most Viewed