భారత్ లో సొంతంగా షోరూమ్ ప్రారంభిస్తామంటున్న టెస్లా.. ఎందుకంటే ?

by  |
tesla
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ సంస్థ భారత్‌లో తన మొదటి విద్యుత్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుత ఏడాది చివరి నాటికి కంపెనీ ఆమోదం లభించిన తన నాలుగు మోడళ్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. పన్ను రాయితీలకు సంబంధించి చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భౌతిక టెస్లా తన్న రిటైల్ షోరూమ్‌ను సొంతగానే నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తోంది. డీలర్ నెట్‌వర్క్ కాకుండా సొంతంగానే షోరూమ్ నుంచి కార్ల విక్రయాలను చేపట్టాలని కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

టెల్సా సంస్థ ప్రస్తుత అమెరికాలో ఆన్‌లైన్ ద్వారా కూడా తన కార్ల విక్రయాలను నిర్వహిస్తోంది. ఇదే సమయంలో జర్మనీతో పాటు పలు దేశాల్లో ఆన్‌లైన్ అమ్మకాలకు అనుమతుల కోసం వేచి ఉంది. భారత్‌లో అనుమతులు మంజూరైతే యూఎస్ తర్వాత ఆన్‌లైన్ అమ్మకాలను జరిపే రెండో దేశంగా భారత్ నిలవనుంది. అయితే, ప్రస్తుతం రాయితీల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి టెస్లా ప్రతినిధులు చర్చలు జరుగుతున్నాయి. విదేశీ కంపెనీలకు ఎఫ్‌డీఐ నిబంధనల సవరణ, సబ్సిడీ, విదేశీ ఉత్పత్తులను స్థానిక ఉత్పత్తులుగా పరిగణించే షరతుల గురించి చర్చిస్తున్నారు.



Next Story

Most Viewed