మే 10న ఇంటర్‌ ఫలితాలు..? పూర్తి వివరాలివే

by Disha Web Desk 17 |
మే 10న ఇంటర్‌ ఫలితాలు..? పూర్తి వివరాలివే
X

దిశ, ఎడ్యుకేషన్: తెలంగాణలో 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు పూర్తిచేసిన విద్యాశాఖ అధికారులు ఇక ఫలితాలపై దృష్టి సారించారు. ఇప్పటికే ఎగ్జామ్ పేపర్ల మూల్యాంకనం ప్రారంభమైంది. దీంతో ఫలితాల విడుదల పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంసెట్‌, నీట్‌, జేఈఈ ప్రవేశ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఇంటర్‌ వాల్యుయేషన్‌ ప్రక్రియను పూర్తిచేసి.. మే 10న ఇంటర్‌ ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్‌ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 9 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూలు ప్రకారం మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఏప్రిల్‌ 3వ తేదీన పదో తరగతి పరీక్షలు ప్రారంభించారు. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు ముగియగా. ఏప్రిల్ 11 తో ఒకేషనల్ పరీక్షలు, ఏప్రిల్ 13 తో ఓరియంటల్ పరీక్షలు ముగిశాయి. మూల్యాంకన ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది.

Next Story