TS CPGET-2023.. పూర్తి వివరాలు ఇవే..!

by Disha Web Desk 17 |
TS CPGET-2023.. పూర్తి వివరాలు ఇవే..!
X

దిశ, ఎడ్యుకేషన్: తెలంగాణలోని ఎనిమిది యూనివర్సిటీల్లో 2023-24 ఏడాది.. పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీగెట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంతో పాటు ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన వర్సిటీలు జేఎన్‌టీయూహెచ్, వాటి అనుంధ కళాశాలల్లో పీజీ కోర్సులైన ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంసీజే, ఎంఈడీ, ఎంపీఎడ్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో సీట్లను సీపీగెట్ పరీక్షలో మెరిట్ ఆధారంగా కేటాయిస్తారు.

పరీక్ష:

కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష(టీఎస్ సీపీగెట్ - 2023)

పీజీ కోర్సులు: ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంటీఎం, ఎంకాం, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఎల్ఐబీఎస్సీ, బీఎల్ఐబీఎస్సీ

అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు విభాగాలు: బయో టెక్నాలజీ/కెమిస్ట్రీ/ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, అప్లైడ్ ఎకనామిక్స్, ఐఎంబీఏ.

పీజీ డిప్లొమా కోర్సులు విభాగాలు: చైల్డ్ సైకాలజీ, ఫ్యామిలీ మ్యారేట్ కౌన్సిలింగ్, ఫోరెన్సిక్ సైన్స్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్.

అర్హతలు: పీజీ, పీజీ డీ కోర్సులకు కనీసం 40 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఎడ్.

ఐపీజీ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో 10+2/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ రూల్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

ప్రవేశ పరీక్ష: సంబంధిత సబ్జెక్టులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ద్వారా నిర్వహిస్తారు.

రిజిస్ట్రేషన్ ఫీజు: సింగిల్ సబ్జెక్టుకు ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ. 800

ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థులకు రూ. 600 ఉంటుంది.

అదనపు సబ్జెక్టుకు అన్ని కేటగిరీలకు రూ. 450 చెల్లించాలి.

పరీక్షతేదీ: జూన్ చివరివారం నుంచి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు.

చివరి తేదీ: జూన్ 11 వరకు లేటు ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్‌సైట్: https://cpget.tsche.ac.in

Next Story

Most Viewed