CBSE : 10th,12th బోర్డు పరీక్షల అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

by Disha Web Desk 20 |
CBSE : 10th,12th బోర్డు పరీక్షల అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
X

దిశ, ఫీచర్స్ : CBSE బోర్డు 10వ, 12వ తరగది పరీక్షలు 15 ఫిబ్రవరి 2024 నుండి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే డేట్‌షీట్‌ విడుదలైంది. CBSE జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పరీక్ష నిర్వహించనున్నారు. ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డును విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inలో అడ్మిట్ కార్డ్‌లు అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్ CBSE విద్యార్థులు వారి సంబంధిత పాఠశాలల నుండి వారి అడ్మిట్ కార్డును పొందవచ్చు. ప్రైవేట్ విద్యార్థులు సీబీఎస్‌ఈ వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. కింద పేర్కొన్న దశలను అనుసరించి విద్యార్థులు పరీక్ష అడ్మిట్ కార్డ్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అడ్మిట్ కార్డ్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

CBSE cbse.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి.

హోమ్ పేజీలో ఇచ్చిన అడ్మిట్ కార్డ్ లింక్‌ పై క్లిక్ చేయండి.

వినియోగదారు ID, పాస్‌వర్డ్ వంటి వివరాలను నమోదు చేయండి.

అడ్మిట్ కార్డ్ మీ స్క్రీన్‌ పై కనిపిస్తుంది.

ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.

Next Story

Most Viewed