ఇండియన్ జాగ్రఫీ

by Disha Web Desk 12 |
ఇండియన్ జాగ్రఫీ
X

తీర మైదానాలు..

భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి అస్థిరమైన వెడల్పుగల తీర మైదానాలచే ఆక్రమించి ఉన్నాయి.

ఇది పశ్చిమాన కచ్ సింధు శాఖ నుండి తూర్పున గంగా బ్రహ్మపుత్ర డెల్టా వరకు విస్తరించి సుమారు 6000 కి.మీ దూరంను ఆక్రమించి ఉన్నాయి.

పశ్చిమ కనుమలు, అరేబియా సముద్రం మధ్య గల ప్రాంతంను పశ్చిమతీర మైదానం అంటారు. తూర్పు కనుమలు తూర్పు తీర మైదానాలు అంటారు.

ఈ రెండు తీర మైదానాలు ఒకదానితో ఒకటి కన్యాకుమారి వద్ద కలుస్తాయి.

కన్యాకుమారి భారతదేశపు ప్రధాన భూభాగ దక్షిణార్ధ అగ్రము.

పశ్చిమ తీర మైదానాలు..

ఇవి ఉత్తరాన కచ్ సింధుశాఖ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు వ్యాపించి ఉన్నాయి.

గుజరాత్‌లో తప్ప, పశ్చిమ తీర మైదానాలు చాలా ఇరుకుగా..సుమారు 65 కి.మీ సరాసరి వెడల్పును కలిగి ఉన్నాయి.

కచ్, కతియావార్‌కు తూర్పువైపున అమరి ఉన్న గుజరాత్ మైదానం నర్మదా, తపతి, మహి, సబర్మతి నదులచే ఏర్పడింది.

ఇది గుజరాత్ ఉత్తర భాగాన, కంభత్ అఖాతం తీరప్రాంతములను కలిగి ఉంటుంది.

తీరం సమీపాన అనేక ఉప్పు నీటి బురద నేలలను కలిగి ఉంటాయి.

ఇవి ఉన్నత వేలా తరంగముల సమయంలో వరదలతో నిండి ఉంటుంది.

కొంకణ్ మైదానం..

కొంకణ్ మైదానం గుజరాత్‌కు దక్షిణాన ఉంది. ఇది సుమారు 500 కి.మీ దూరంతో గోవా వరకు విస్తరించి ఉంది.

దీని వెడల్పు సుమారు 50 నుంచి 80 కి.మీ ఉంటుంది. సముద్ర క్షయంచే ఏర్పడిన కొండ లేక తిప్ప పగడపు దిబ్బలు, దీవులు దక్షిణ ముంబయిలో ఉన్నాయి.

కర్ణాటక మైదానం..

గోవా నుండి మంగళూరు వరకు విస్తరించాయి.

ఇది సుమారు 30 నుండి 50 కి.మీ సరాసరి వెడల్పును కలిగి ఉంటుంది.

కొన్ని ప్రాంతాల్లో ఇది నిట్టనిలువుగా, ఏటవాలుగా క్రిందికి దిగి జలపాతం ఏర్పరుస్తుంది.

మలబార్ మైదానం..

మంగళూరు, కన్యాకుమారికి మధ్య ఉంటుంది. ఇది సుమారు 50 కి.మీ విస్తరించి ఉంది.

దీని వెడల్పు 25 నుండి 100 కి.మీ

తీర మైదానం ముఖ్య లక్షణం సరస్సులు, మడుగులు, వెనుకకు మళ్లే సముద్ర జలాలు ఉండటం.

దీనిని స్థానికంగా కయ్యలు అంటారు.

మడుగులు, వెనుకకుమళ్లే సముద్రపు జాలాలు తీరరేఖకు సమాంతరంగా ఉంటాయి.

మడుగులు, వెనుకకు మళ్లే సముద్రపు జలాలు కాలువలచే అసుసంధానం చేయబడి ఉండటం వలన చిన్న పడవల ద్వారా ప్రయాణానికి అనుకూలంగా ఉంది.

తూర్పు తీర మైదానాలు..

ఇది పశ్చిమ బెంగాల్ డెల్టా ప్రాంతం నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది.

తూర్పు కనుమలు, బంగాళాఖాతంకు మధ్య విస్తరించి ఉంది.

తూర్పు తీర మైదానం అధిక విశాలముగా పశ్చిమ తీరమైదానాల కంటే విశాలంగా ఉంటాయి.

ఈ మైదానం అధిక భాగం మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదులచే తీసుకొని రాబడిన ఒండ్రు మట్టి అవక్షేపములచే ఏర్పడింది.

దీని సరాసరి వెడల్పు సుమారు 120 కి.మీ

ఇది డెల్టా ప్రాంతంలో 200 కి.మీ వరకు ఉంటుంది.

ఈ ప్రాంతం ఇసుక తీరములతో కూడిన పొడవైన తీరరేఖను కలిగి ఉంటాయి.

మహానది, కృష్ణానదుల మధ్య గల తీర మైదానం ఉత్తర సర్కారులని.. కృష్ణా, కావేరి నదుల మధ్య గల భాగం చోళ మండల తీరమని అంటారు.

ఉత్కల్ మైదానం

ఉత్కల్ మైదానం ఒరిస్సా తీరం వెంబడి ఉంటుంది. ఇది సుమారు 400 కి.మీ విస్తరించి ఉంటుంది.

మహానది డెల్టా ప్రాంతం కలిగి ఉంటుంది.

ఉత్కల్ మైదానం తీరరేఖ నునుపుగా..ఇసుక దిబ్బల అంచులను కలిగి ఉంటుంది.

భారతదేశంలో గల చిల్కా సరస్సు అతి పెద్దది. ఇది మహానది డెల్టాకు దక్షిణ వైపున ఉంది. ఆంధ్రా మైదానం బెర్హమ్‌పూర్, పులికాట్ సరస్సుకు మధ్య ఉంటుంది. ఇది గోదావరి, కృష్ణానది డెల్టాలచే ఏర్పడి ఉంటుంది.

ఆంధ్రా మైదానం పొడవైన తీరంను, కొన్ని గొప్ప ఓడరేవు కేంద్రంలను నిర్మించుటకు అనువుగా ఉంటుంది.

వీటిలో విశాఖపట్టణం, మచిలీ పట్టణాలు ముఖ్యమైనవి. ఆంధ్రా మైదానంలో కొల్లేరు సరస్సు కలదు.

తమిళనాడు మైదానం..

పులికాట్ సరస్సు నుండి కన్యాకుమారి వరకు సుమారు 982 కి.మీ విస్తరించి ఉంటుంది.

దీని సరాసరి వెడల్పు 100 కి.మీ సారవంతమైన మన్ను, మిక్కిలి అభివృద్ధి చెందిన నీటి పారుదల సదుపాయాలు కావేరి నది డెల్టాను దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా మార్చి వేసింది.

- చిట్ర ఆనంద్, సీనియర్ ఫ్యాకల్టీ. హైదరాబాద్

Next Story

Most Viewed