బిట్‌శాట్ - 2023 నోటిఫికేషన్ విడుదల

by Disha Web Desk 17 |
బిట్‌శాట్ - 2023 నోటిఫికేషన్ విడుదల
X

దిశ, ఎడ్యుకేషన్: రాజస్థాన్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) - బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్ (బిట్‌శాట్) - 2023 నోటిఫికేషన్‌ను

విడుదల చేసింది.

ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాం :

బిట్స్ పిలానీ - పిలానీ క్యాంపస్ :

1. బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్.

2. బి ఫార్మసీ

3. ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.

4.ఎంఎస్సీ: జనరల్ స్టడీస్

బిట్స్ పిలానీ - కేకే బిర్లా గోవా క్యాంపస్:

1. బీఈ: కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్.

2. ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.

బిట్స్ పిలానీ - హైదరాబాద్ క్యాంపస్:

1. బీఈ: కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్.

2. బీఫార్మసీ.

3. ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.

అర్హత: అభ్యర్థులు 75 శాతం మార్కులతో (గ్రూప్ సబ్జెక్టుల్లో ప్రతీ సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులుండాలి)

ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్/బయాలజీ) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: బిట్‌శాట్ - 2023 టెస్టు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: బిట్‌శాట్ - 2023 టెస్టు రెండు సెషన్లలో జరుగుతుంది. అభ్యర్థులు రెండు సెషన్లు రాయవచ్చు. రెండింటిలో బెస్ట్ స్కోరునే పరిగణనలోకి తీసుకుంటారు.

పరీక్ష ఫీజు: సెషన్ 1,2 పరీక్షలకు రూ. 5,400 (పురుషులు); రూ. 4,400 (మహిళలు)

ఏపీ, తెలంగాణల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విజయవాడ,విశాఖపట్నం, రాజమహేంద్రవరం.

చివరి తేదీ: ఏప్రిల్ 9,2023.

బిట్‌శాట్ ఆన్‌లైన్ టెస్ట్ సెషన్ -1: మే 21 నుంచి 26/2023.

బిట్‌శాట్ ఆన్‌లైన్ టెస్ట్ సెషన్ - 2: జూన్ 18 నుంచి 22/2023.

వెబ్‌సైట్: https://www.bitsadmission.com


Next Story

Most Viewed