ఈ ఎడ్యుకేషన్ యాప్స్ లో .. పాఠాలు ఉచితం

by  |
ఈ ఎడ్యుకేషన్ యాప్స్ లో .. పాఠాలు ఉచితం
X

దిశ వెబ్ డెస్క్ :
దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో దాదాపు పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. విద్యార్థులంతా అయోమయోంలో ఉన్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకైతే అందరూ పై తరగతులకు ప్రమోట్ అయ్యారు. పదో తరగతి విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇంకా పై తరగతులు చదివే విద్యార్థులు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఈ క్వారంటైన్ టైమ్ అందరూ విద్యార్థులు తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఆన్ లైన్ పాఠాలు వింటూ..తమ నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. అందుకోసం కొన్ని యాప్ లు ఉచితంగా సేవలు అందిస్తున్నాయి.

కరోనా వైరస్ ఆ తర్వాత లాక్ డౌన్ తో చాలా పరీక్షలు వాయిదా పడ్డాయి.. దీంతో.. సిలబస్ కూడా పూర్తి చేయని పాఠశాలలు, కాలేజ్ లు ఆన్ లైన్ లో పాఠాలు భోదిస్తున్నాయి.. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఆన్ లైన్ లో సిలబస్ భోదించాలని నిర్ణయించారు… ఈ మేరకు అన్ని కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది ఉస్మానియా యూనివర్సిటీ. అటు ఏపీ లోనూ.. సప్తగిరి చానెల్ లో పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని ఎడ్యుకేషన్ యాప్స్ కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉచితంగా కోర్సులు అందిస్తున్నాయి. బైజు, టొప్పర్, వేదాంతు ఆ జాబితాలో నిలిచాయి.

BYJU యాప్ :

‘బైజుస్’ మనదేశంలో అతి ఎక్కువ మంది ఉపయోగిస్తున్న K – to – 12 ఎడ్యుకేషన్ లెర్నింగ్ యాప్. దేశంలోని అత్యుత్తమ ఉపాధ్యాయుల నుండి యానిమేటెడ్ వీడియో పాఠాలు అందించే ఆన్ లైన్ వేదిక ఇది. JEE, NEET, CAT, IAS, GRE, GMAT లాంటి పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ పాఠాలు, టిప్స్ కూడా అందిస్తుంది. IAS కి ప్రిపేర్ అయ్యే వారికోసం ప్రిలిమ్స్, మెయిన్స్ కు అవసరమైన టిప్స్ ను ఐఏఎస్ టాపర్ల నుంచి అందిస్తుంది. దీనికి 42 మిలియన్ రిజిస్టర్ యూజర్స్ ఉన్నారు. అయితే లాక్ డౌన్ సమయంలో BYJU యాప్ తన సేవలను ఉచితంగా అందించనుంది. ఈ యాప్ ద్వారా 1నుంచి 12 తరగతుల విద్యార్ధులు విద్యా అభ్యసించటానికి ఉపయోగపడుతుంది. విద్యార్థులు తమ స్లాట్ ను బుక్ చేసుకుని ఉచిత పాఠాలు వినొచ్చు. ఇందుకోసం బైజు యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని లాగిన్ కావాల్సి ఉంటుంది. లైవ్ క్లాస్ లు వినొచ్చు. ప్రస్తుత పరిస్థితులు తేలికపడే వరకు యావత్ భారతీయ విద్యార్థులకు ఫ్రీ క్లాసులు కొనసాగిస్తామని బైజు డైరెక్టర్ తెలిపారు.

జీనియో:

బైజుస్ లానే జీనియో కూడా విద్యార్థులకు ఉచిత క్లాసులను అందిస్తోంది. ఢిల్లీకి చెందిన ఈ ఎడ్యు యాప్ .. ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు మాత్రమే దీన్ని పరిమితం చేసింది. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్ట్ ల కు సంబంధించిన ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని తెలిపింది.

టోప్పర్ :

ఈ యాప్ ద్వారా అన్ని సబ్జక్టుల యాక్సెస్ తో పాటు, ప్రీమియం సభ్యత్వం లేకుండా విద్యార్ధులకు లైవ్ క్లాసులకు హాజరయ్యే అవకాశాన్ని అందిస్తుంది. ఈ యాప్ సిఇఒ జిషాన్ హయత్ మాట్లాడుతూ కోవిడ్ 19 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని మేము 5 నుంచి 12 తరగతుల విద్యార్ధులందరికీ టోప్పర్ యాప్ ద్వారా ఉచితంగా లైవ్ క్లాసులను అందజేస్తున్నాం అని తెలిపారు.

స్వయం ప్రభ :

కేంద్ర ప్రభుత్వం 24 గంటల పాటు విద్యా సమాచారం అందించేందుకు రూపొందించిన చానెల్ ఇది. ఇందులో డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించి అన్ని సబ్జెక్టుల సిలబస్ ను అందిస్తున్నారు. పలు కోర్సులకు సంబంధించిన మెటీరియల్ ను కూడా ఇందులో అందిస్తోంది. వివరాలకు swayamprabha.gov.in చూడండి.

వేదాంతు, లిడో ఎడ్యూ యాప్ లు కూడా .. ఆన్ లైన్ ఫ్రీ తరగతులను ఏప్రిల్ 14 వరకు అందించాయి. మరి లాక్ డౌన్ పెరగడంతో .. మరి వీటి సేవలను కొనసాగిస్తో లేదో ఇంకా తెలియదు.

Tags: corona virus, lockdown, education, edu app, byju’s, geneo, topper, swayam prabha



Next Story

Most Viewed