ఇదీ సంగతి:అప్పుల మహా భారతం ఇది

by Disha edit |
ఇదీ సంగతి:అప్పుల మహా భారతం ఇది
X

ధరల పెరుగుదల, పీఎస్‌యూల ప్రైవేటీకరణ, పొలిటికల్, ఆర్థిక విధానాలు మరింతగా అసమానతలను పెంచేస్తున్నాయి. ఎన్నికలలో పోటీ పడడం, గెలవడం, అధికారం కోసం వెంపర్లాడడం తప్ప ఎక్కడ ఏమీ కనిపించడం లేదు. అవే విద్వేషాలను రెచ్చగొట్టే 80-20 రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఒకసారి హిజాబ్, మరోసారి కాశ్మీర్ ఫైల్స్ సినిమా, ఇప్పుడు హలాల్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు తెరమీదకు వస్తున్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల మీద ఒక్క మాట లేదు. కనీసం చట్ట సభలలో మాట్లాడే అవకాశం లేదు. మొత్తంగా ప్రభుత్వ ఆస్తులన్నీ అంబానీ, అదానీకు అప్పజెప్పే రాజనీతి కొనసాగుతున్నది, ప్రతి రోజూ అదాని 756 కోట్లు, అంబానీ 378 కోట్లు సంపాదిస్తున్నారు.

దేశంలోని 28 రాష్ట్రాలు 80 లక్షల కోట్ల రూపాయల అప్పులలో కూరుకుపోయాయి. ఇందులో 18 రాష్ట్రాల పరిస్థితి అధ్వానంగా ఉంది. బిహార్, ఝార్కండ్‌లాంటి ఆరు పేద రాష్ట్రాలు అప్పుల నుంచి తేరుకునే పరిస్థితి లేదు. దీనికి అదనంగా కేంద్రం 46 లక్షల 50 వేల కోట్ల రూపాయల ఎక్స్‌టర్నల్ అప్పులు చేసింది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ నిబంధనలు, అవి అప్పులు వసూలు చేసే విధానం ఇరకాటంలో పెట్టే పరిస్థితి ఉంది. 2014 తర్వాత దేశం ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతూ పోతున్నది.

ఉచితాల కన్నా కార్పొరేట్లకు ఇస్తున్న బ్యాంకు రుణాల రిటర్న్ ఆఫ్ ఎక్కువైపోయి బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి వచ్చింది. రాష్ట్రాల యావరేజ్ అప్పులు 35 జీడీపీ వరకు ఉన్నాయి. పంజాబ్ జీడీపీ 50 శాతం కన్నా ఎక్కువ అప్పులలో ఉంది. ఇక్కడ 2.83 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. పాకిస్తాన్ కన్నా ఎక్కువ జనాభా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ 6.11 లక్షల కోట్లు, గుజరాత్ 3.92 లక్షల కోట్లు, పశ్చిమ బెంగాల్ 4 లక్షల కోట్లు అప్పులలో ఉన్నాయి. గుజరాత్ రిజర్వు బ్యాంకు కు 4.5 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉంది. శ్రీలంక జనాభా 2.25 కోట్లు ఉంటుంది. అంటే మన దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అంత తక్కువ జనాభా ఉండరు. అంత చిన్న దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగి, మొత్తం ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ఆకలి ఆకలి అనే పరిస్థితి వచ్చింది. మన దేశంలో 80 కోట్ల మందికి రేషన్ ఉచితంగా లభిస్తున్నది. దీనికి రైతన్నలే కారణం. ఎగుమతులలో 60 శాతం వ్యవసాయం నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మాత్రమే కారణం.

యుద్ధం సాకుగా చూపి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులు తగ్గి భారీ నష్టాలు వచ్చాయి. ఈ నష్టం 1.52 బిలియన్ డాలర్స్‌గా ఉందని అంచనా. ఈ రోజు దేశం ఆర్థిక పరిస్థితిని పూర్తిగా కుదేలు కాకుండా నిలబెడుతున్న రైతులకు కేంద్రం అంగీకరించిన మాదిరి ఎం‌ఎస్‌పీని ఇప్పటి దాకా ప్రకటించలేదు. అన్ని రాష్ట్రాలలో అదాని ధాన్యం గోడౌన్‌ల నిర్మాణం ఇంకా జరుగుతూనే ఉంది. 378 రోజుల సుదీర్ఘ ఆందోళన 750 మంది రైతుల ఊపిరి తీసింది.

ఉద్యమం ఫలితంగా పీఎం నరేంద్ర మోదీ మూడు నల్ల చట్టాలను రద్దు చేసారు. అయినా అదాని గోడౌన్‌ల నిర్మాణం ఆపకపోవడంలో ఆంతర్యం ఏమిటో ఎవరు చెప్పాలి? ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రానికి స్పష్టమైన విధానం లేదు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతున్నది. ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్నారు. దేశాన్ని ఆదుకుంటున్న రైతుల పట్ల కేంద్రం విధానాలు చాలా అన్యాయంగా ఉన్నాయనడానికి యూపీలో గత ఏడాది లఖింపూర్ ఖేరీలో జరిగిన నలుగురు రైతుల హత్యోదంతం చాలు. యూపీలో ఎన్నికలు పూర్తి అయి బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చినా, కేంద్ర మంత్రి తనయుడు నలుగురు రైతులను తన జీపుతో ఢీకొట్టి చంపిన విషయంలో పీఎం నరేంద్ర మోదీ ఒక్క సానుభూతి మాట అనలేదు. అదానీ, అంబానీ సంపాదన భారీగా పెరిగింది. ప్రభుత్వ ఆదాయం, పౌరుల ఆదాయం తగ్గింది.

పెరుగుతున్న అసమానతలు

ధరల పెరుగుదల, పీఎస్‌యూల ప్రైవేటీకరణ, పొలిటికల్, ఆర్థిక విధానాలు మరింతగా అసమానతలను పెంచేస్తున్నాయి. ఎన్నికలలో పోటీ పడడం, గెలవడం, అధికారం కోసం వెంపర్లాడడం తప్ప ఎక్కడ ఏమీ కనిపించడం లేదు. అవే విద్వేషాలను రెచ్చగొట్టే 80-20 రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఒకసారి హిజాబ్, మరోసారి కాశ్మీర్ ఫైల్స్ సినిమా, ఇప్పుడు హలాల్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు తెరమీదకు వస్తున్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల మీద ఒక్క మాట లేదు. కనీసం చట్ట సభలలో మాట్లాడే అవకాశం లేదు. మొత్తంగా ప్రభుత్వ ఆస్తులన్నీ అంబానీ, అదానీకు అప్పజెప్పే రాజనీతి కొనసాగుతున్నది, ప్రతి రోజూ అదాని 756 కోట్లు, అంబానీ 378 కోట్లు సంపాదిస్తున్నారు. ఈ మంత్రం ఏదో బాగుంది. వారి నుంచి లాభం ఎలా సాధించాలో ప్రభుత్వం నేర్చుకునే పరిస్థితి ఉంది.

ప్రజల మీద భారం, వారి ఖాతాలో లాభం 'వాహ్ క్యా బాత్ హై పీఎం మోదీజీ, ఆప్కా సాత్ దోస్తోంకా వికాస్ - దేశ్ కా దివాలా అచ్ఛా హై' పబ్లిక్ సెక్టార్‌ను దివాలా తీసి ప్రైవేట్ సెక్టార్‌కు చేయూత ఇవ్వండి. రోడ్ల మీద బండ్లు తిప్పే పరిస్థితి కూడా లేకుండా పోతోంది. పెట్రో ధరల పెరుగుదలతో ఫ్యూచర్ దెబ్బ తినే పరిస్థితి ఉంది. పెరుగుతున్న వంట గ్యాస్ వలన గ్యాస్ పొయ్యిలు 60 శాతం మూలన పడ్డాయి. గ్రామాలలో కట్టె పొయ్యిలు వెలుగుతున్నాయి. సగం మందికి, సగం రోజులే ఉపాధి హామీ పనులు లభిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఉచిత రేషన్ ఇస్తే చాలు అంటూ ఎన్నికల యావలో పడిపోయింది.

ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223



Next Story