కవలల కథా కమామీషు

by Disha edit |
కవలల కథా కమామీషు
X

ఒక అధ్యయనం నైజీరియాలోని నైరుతి ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధికంగా 110 మిలియన్ కవలలు (11 కోట్లు) ఉన్నారని అంచనా వేసింది. 22 శాతం మంది ఒకే పోలిక గల కవలలు ఆఫ్రికా దేశాలలో జన్మించడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.60 మిలియన్‌ (10 లక్షల 60 వేల మంది) కవలలు పుడుతున్నారని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ 2021లో ప్రచురించిన పరిశోధనా పత్రాలలో వివరించింది. ప్రతి 42 మంది శిశువులకుగాను ఒక జంట ఉందని పేర్కొంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన క్రిస్టియన్ మొండెన్ తన సహచరులతో కలిసి 2010-2015 మధ్య కాలంలో 135 దేశాలలో చేపట్టిన అధ్యయనం ప్రకారం ఐవరీ కోస్ట్‌లో జరిగిన ప్రతి 1000 ప్రసవాలలో దాదాపు 25 శాతం శిశువులు కవలలు అని 2020లో ప్రచురించిన నివేదికలో పేర్కొన్నారు.

చరాచర సృష్టిలో దాదాపు 84 లక్షల జీవరాసులున్నాయని హిందూ గ్రంథాలలో పేర్కొనబడింది. ఇందులో 21 లక్షలు అండజం (గుడ్డు నుండి పుట్టేవి), 21 లక్షలు స్వేదజమ్ (నీటి చెమ్మ నుండి పుట్టేవి), 21 లక్షలు ఉద్భుజం (భూమిని చీల్చుకుని పుట్టేవి), 21 లక్షలు జరాయుజం (మావి చేత కప్పబడి పుట్టేవి) ఉన్నాయి. వీటన్నింటిలోనూ మానవునికి ప్రత్యేక స్థానం ఉంది. క్షీరదాలు లేదా సరీసృపాలు ఒకే కాన్పులో ఒకటి లేదా అంతకు మించి ప్రాణులకు జన్మనిస్తాయి. మానవులలో ఆ సంఖ్య సాధారణంగా ఒకటి అయినప్పటికీ, కొన్ని సందర్భాలలో రెండు, అరుదైన సందర్భాలలో అంతకన్నా ఎక్కువగా ఉండేందుకు అవకాశముంది. 2009లో నాడ్యా సులేమాన్ అనే మహిళ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒకే కాన్పులో సజీవంగా ఆరుగురు మగ, ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. ఇదే గిన్నిస్ రికార్డు.

అంతుచిక్కని కారణాలు

జూన్ 2021 లో చేపట్టిన ఒక అధ్యయనం నైజీరియాలోని నైరుతి ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధికంగా 110 మిలియన్ కవలలు (11 కోట్లు) ఉన్నారని అంచనా వేసింది. 22 శాతం మంది ఒకే పోలిక గల కవలలు ఆఫ్రికా దేశాలలో జన్మించడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.60 మిలియన్‌ (10 లక్షల 60 వేల మంది) కవలలు పుడుతున్నారని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ 2021లో ప్రచురించిన పరిశోధనా పత్రాలలో వివరించింది. ప్రతి 42 మంది శిశువులకుగాను ఒక జంట ఉందని పేర్కొంది.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన క్రిస్టియన్ మొండెన్ తన సహచరులతో కలిసి 2010-2015 మధ్య కాలంలో 135 దేశాలలో చేపట్టిన అధ్యయనం ప్రకారం ఐవరీ కోస్ట్‌లో జరిగిన ప్రతి 1000 ప్రసవాలలో దాదాపు 25 శాతం శిశువులు కవలలు అని 2020లో ప్రచురించిన నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచంలోనే కవలల జననం ఆఫ్రికాలో అత్యధికం అని అభిప్రాయపడ్డారు. ఘనా, దక్షిణ సూడాన్ దేశాలు వరుసగా ప్రతి 1000 ప్రసవాలకు 24.80, 24.70 శాతం కవలలతో ద్వితీయ స్థానంలో ఉన్నాయని నివేదికలో పొందుపరిచారు. ఆఫ్రికాలో అత్యధిక కవలల జననానికి ప్రధాన కారణం రెండు అండాల కవలలు (రెండు వేర్వేరు అండాల నుండి జన్మించే శిశువులు) అని ప్రొఫెసర్ మొండెన్ పేర్కొన్నారు.

కవలల స్వగ్రామం

మన దేశంలోని కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో కోడిన్హి అనే గ్రామంలో దాదాపు 2000 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ అనధికారిక అంచనా ప్రకారం 400 కవలలు ఉన్నారు. 2008లో చేపట్టిన అధికారిక అంచనాల ప్రకారం ఈ సంఖ్య 280 గా నిర్ధారించారు. 2008 తర్వాత ఆ సంఖ్య గణనీయంగా పెరిగినట్టు అభిప్రాయం. దేశంలో 100 శిశు జననాలలో 9 మంది శిశువులు కవలలు కాగా, ఆ గ్రామంలో వారి సంఖ్య 45 కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు సీఎస్ఐఆర్-సీసీఎంబీ హైదరాబాద్, కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్, ఓషన్ స్టడీస్ లండన్, జర్మనీ యూనివర్సిటీ సంయుక్తంగా పరిశోధన ప్రారంభించాయి. వారి నుండి డీఎన్ఏ, లాలాజలం, వెంట్రుకల శాంపిల్స్ సేకరించారు.దక్షిణ వియత్నాం హంగ్‌హీప్‌లోని హంగ్‌లాక్ కమ్యూన్, నైజీరియాలోని ఇగ్బో ఓరా, బ్రెజిల్‌లోని కాండిడో గోడాయ్‌లో కూడా ఏక కాలంలో అధ్యయనం చేపడుతున్నారు.

కేరళ వర్సిటీ ప్రొఫెసర్ ప్రీతం మాట్లాడుతూ 'ఈ అరుదైన పరిణామాల పట్ల శాస్త్రవేత్తలకు విభిన్న అభిప్రాయాలున్నప్పటికీ, వాటిని ధ్రవీకరించడానికి ఆధారాలు లేవు. జన్యుపర కారణాలు అని చాలా మంది భావిస్తున్నప్పటికీ, ఆ గ్రామంలోని వాతావరణంలోని గాలి లేదా నీటిలో ఇమిడి ఉండే ధాతువు కూడా కారణమని కొందరి అభిప్రాయం. గ్రామ పొలిమేరలో 'భగవంతుని కవలల స్వగ్రామం కోడిన్హికి స్వాగతం' అనే నీలి రంగు బోర్డు సందర్శకులకు దర్శనమిస్తుంది. ఇక్కడనే దేశంలోని ఏకైక కవలల సంఘం ఉంది. కవలల సంక్షేమం కోసం తాము ఒక అసోసియేషన్ స్థాపించి రిజిస్ట్రేషన్ కూడా చేయించాం' అని అన్నారు.

మానవ మేధస్సుకు అందని శక్తి

ఆంధ్ర ప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామం కవలల గ్రామంగా ప్రాచుర్యం పొందింది. ఈ గ్రామంలో 500 కవలలు ఉన్నారు. ఆ గ్రామంలో ఉన్న ఓ బావిలోని నీరు తాగిన మహిళకు కచ్చితంగా కవలలు పుడతారని, సంతానం లేని మహిళలు తప్పక గర్భం దాలుస్తారన్నది ఆ గ్రామ ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ బావిలోని నీరు ఎన్నో రుగ్మతలకు దివ్యౌషధంగా కూడా పని చేస్తుందని పరిసర ప్రాంతాల నుండి వచ్చి తీసుకువెళతారు.

ఈ బావి నీటిని హైదరాబాద్, విశాఖపట్నం లేబరేటరీలలో పరిశీలించినప్పటికీ కవలలకు జన్మనిచ్చే ఎటువంటి ప్రత్యేకతను కనుగొనలేకపోయారు. ఇది మూఢనమ్మకం ఎంత మాత్రం కాదని, ఈ బావి నీటిలో మానవ మేధస్సుకు అందని అదృశ్య శక్తి ఉందని గ్రామస్తులు అంటారు. ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలు వివాహానంతరం ఈ గ్రామానికి వచ్చిన సందర్భాలలో వారికి కూడా కవలలు జన్మించిన దృష్టాంతాలను ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. డాక్టర్లు మాత్రం శిశువుల జననంలో జన్యుపర అంశాలే కీలకం అని చెబుతున్నారు.

యేచన్ చంద్రశేఖర్

హైదరాబాద్

88850 50822


Next Story