నర్సుల ఒత్తిడిని తగ్గించలేరా?

by Disha edit |
నర్సుల ఒత్తిడిని తగ్గించలేరా?
X

రోజుకు 11 గంటల కంటే ఎక్కువ పనిచేయడం వలన గుండె సమస్యలు, రాత్రి షిఫ్ట్ లో 14 గంటలు పనిచేయడం వలన రొమ్ము క్యాన్సర్ వస్తాయని '2009- ఇంటర్నేషన్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్‌సీ), వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( డబ్లూహెఓ) నివేదిక వెల్లడించింది. ఇతర వృత్తి నిపుణుల కంటే నర్సింగ్ వృత్తి నిపుణులు అత్యధికంగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. శారీరక శ్రమయే కాకుండా కంప్యూటర్ డాక్యుమెంటేషన్ ఒకేసారి పది మంది రోగులకు చేయడం మరింత ఒత్తిడిని పెంచుతుంది. నాడీ వ్యవస్థ మీద ఒత్తిడి కలిగిస్తుంది. వారం వారం షిఫ్ట్‌ను మార్చడం వలన శరీరాన్ని సర్దుబాటు చేయలేరు. మరొక్క సమస్య నర్స్‌గా ఉంటూ ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు నిర్వహించడం, వివాహ జీవితం సవాలుగా ఉంటుంది.

భారతదేశంలో అనేక రకాల వృత్తులు ఉన్నాయి. కొన్ని సరళతరమైనవి. మరికొన్ని కష్టతరమైనవి. ఇంకొన్ని సంక్లిష్టమైనవి. ఒకటి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అదే నర్సింగ్ వృత్తి. వ్యక్తిగత నిబంధనలు, తీవ్ర ఒత్తిడి, అత్యధిక పని వేళలు ఉన్న వృత్తులలో ఇది ఒకటి. నిజానికి ఇతరులకు సహాయం చేయాలనే దృక్పథం ఉన్నవారే ఈ వృత్తిలోకి వస్తారు. రోగికి సేవలు చేస్తున్నపుడు ఈ వృత్తి ఎంత కఠినమైనదో, ఎంత విభిన్నమైనదో తెలుసుకుంటారు. ఒక్కోసారి రోగి మరణించబోతున్నాడని తెలిసి తీవ్ర ఒత్తిడికి గురవుతారు. అయినా పక్కన ఉండి చిరునవ్వుతోనే వారికి తగిన సేవలు అందిస్తారు. ఆసుపత్రిలో వివిధ రకాల సేవలలో ఉంటే నర్సులను నేను ప్రత్యక్షంగా చూశాను.

మొదట డెత్ కేర్ కష్టంగా ఉండేది. రాత్రి సమయాలలో ఒంటరిగా నిద్రపోలేకపోయాను. ఒకవేళ పడుకున్నా ఏదైనా శబ్దం విని ఉలిక్కిపడి నిద్రలేచిన రోజులు లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. వ్యక్తుల మధ్య సంబంధాలు కూడా ఒత్తిడికి కారణమే. వృత్తిలో పనిభారం, సహోద్యోగులతో విభేదాలు, హెడ్ నర్సుతో గొడవలు, రోగుల నుంచి ఇన్ఫెక్షన్ సోకుతుందనే భయం తీవ్ర ఒత్తిడిలోకి నెట్టివేస్తుంది. రోగులకు సూదులు ఇచ్చినప్పుడు, శరీర ద్రవాలు శుభ్రపరుస్తున్నప్పుడు, లేదా వారిని కాపాడాలనే కంగారులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే రోగులను తాకినపుడు కొన్ని వ్యాధులకు గురవుతాము. ఆసుపత్రిలో ఉపయోగించే ప్రమాదకర రసాయన పదార్థాలు, రేడియేషన్ వలన నర్సులు ఎక్కువ ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది. అధిక పనిభారం వలన శారీరక ఒత్తిడి తప్పదు. వారానికోసారి వివిధ షిఫ్టులలో పని చేయడం మూలన సాధారణ జీవితాలు, బంధుత్వాలు, మానసిక ప్రశాంతత కోల్పోతున్నరు. విశ్రాంతి లేకపోవడం వలన అసమతుల్యత వలన అనేక అలసట ఏర్పడి శరీరంలో హార్మోన్ స్థాయికి అంతరాయం ఏర్పడి అనేక మంది చనిపోతున్నారు.

Also read: సేవామూర్తులు మన నర్సులు

సవాళ్లతో కూడిన జీవితం

రోజుకు 11 గంటల కంటే ఎక్కువ పనిచేయడం వలన గుండె సమస్యలు, రాత్రి షిఫ్ట్ లో 14 గంటలు పనిచేయడం వలన రొమ్ము క్యాన్సర్ వస్తాయని '2009- international agency for research on cancer (IARC), world health organization ( WHO) నివేదిక వెల్లడించింది. ఇతర వృత్తి నిపుణుల కంటే నర్సింగ్ వృత్తి నిపుణులు అత్యధికంగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. శారీరక శ్రమయే కాకుండా కంప్యూటర్ డాక్యుమెంటేషన్ ఒకేసారి పది మంది రోగులకు చేయడం మరింత ఒత్తిడిని పెంచుతుంది.

నాడీ వ్యవస్థ మీద ఒత్తిడి కలిగిస్తుంది. వారం వారం షిఫ్ట్‌ను మార్చడం వలన శరీరాన్ని సర్దుబాటు చేయలేరు. మరొక్క సమస్య నర్స్‌గా ఉంటూ ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు నిర్వహించడం, వివాహ జీవితం సవాలుగా ఉంటుంది. కుటుంబంలో జరిగే శుభ సందర్భాలలో కూడా కుటుంబ సభ్యులను కలుసుకోలేని పరిస్థితి. అన్ని ఒత్తిడిలను మేము ఎదుర్కొంటున్నాం కాబట్టి విధి నిర్వహణలో ఇంకాస్తా ఒత్తిడిలో ఉంటున్నాం. దీనికి పరిష్కార మార్గాలు వెతకాల్సి ఉంది.


నక్క సూర్యకుమార్

రాష్ట్ర అధ్యక్షుడు

తెలంగాణ ఫ్లోరెన్స్ నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్

9704254854

Next Story

Most Viewed