ఇదీ సంగతి: భ్రమల్లో జీవించుడు ఎందుకు?

by Disha edit |
ఇదీ సంగతి: భ్రమల్లో జీవించుడు ఎందుకు?
X

సమాజహితం, దేశహితం, దేశ ప్రజల హితంలో మీడియా ఉంటే పాలకులకు అదోరకమైన ఉక్రోషం అంటే అతిశయోక్తి కాదు. సహజంగానే ప్రజా ప్రతినిధులకు సైతం ప్రజల వైపు ఉండే పాత్రికేయుల మీద కోపం ఎక్కువగా ఉంటుంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే పరిస్థితి. అందుకే పీపుల్స్ జర్నలిస్ట్‌లు పనిచేసే వాతావరణం మీడియా యాజమాన్యాల దగ్గర లేని కారణంగా ఆయా సంస్థలను వదిలేసి తన గమ్యం వేటలో జర్నలిస్ట్ లు చాలామంది పడిపోతున్నారు. దానికి కొన్నిచోట్ల సమాజం ఊహించని కులం, మతం ఫ్యాక్టర్ కూడా ప్రధానంగా కనిపిస్తున్నది. అందుకే జర్నలిస్ట్ సమాజం బీ యునైట్ అండ్ అలర్ట్. కనీసం లైక్ మైండెడ్ అయినా సమీక్షించుకుంటే మంచిది. గుండె ఉన్నది పిడికెడే అయినా బాధ్యత ఆకాశమంత అనేది గుర్తుంచుకోవాలి!

నిషి భ్రమల్లో జీవించడం కన్నా మించిన మూర్ఖత్వం మరోటి ఉండదు. నిజానికి ప్రభుత్వం ప్రతీ రోజు మంచి పనిచేస్తున్నామని చెబుతుంది. తాము చెప్పిందే ప్రసార మాధ్యమాలలో ప్రసారం కావాలని అనుకుంటుంది. ప్రస్తుతం ఇదే జరిగింది. ప్రజల వైపు నిలబడి నిజమైన వార్తలు, స్టోరీలు ప్రసారం చేసిన ఎన్‌‌డీటీవీ(NDTV) విషయంలో. నిజానికి దీని డైరెక్టర్‌గా ఉన్న ప్రణయ్ రాయ్(Pranay roy) ఎంతో కష్టపడి దీనిని నిర్మించారు. ఇప్పుడు ఆయన టీవీలోంచి రాజీనామా చేసిన దానికి వివిధ రకాల కారణాలు ప్రసారమవుతున్నాయి.

ఎన్‌‌డీటీవీ ని అదానీ(adani) కోనుగోలు చేశాక ప్రణయ్ రాయ్, రాధిక రాయ్(radhika roy) తో సహా ప్రైమ్ టైం రవీశ్ కుమార్(ravish kumar) సైతం రాజీనామా చేశారు. ప్రణయ్ రాయ్ దాని చైర్మన్ గా ఉండే అవకాశం ఉన్నా సరే ఆయన కూడా రాజీనామా చేశారు. ప్రైమ్ టైం రవీశ్ కుమార్ అభిసార్ శర్మ(abhishar sharma), పుణ్య ప్రసూన్(punya prasun) లాంటి వారిలాగా మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి బయటకు వచ్చి సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు.

గన్ను సైతం ముడుచుకోవాల్సిందే

నిజాయితీ గల పాత్రికేయులకు వచ్చే కలలు సైతం పీడిత, తాడిత ప్రజల సమస్యలు, కష్టాలు, ప్రభుత్వ దాష్టికాలే వస్తుంటాయి. వారికి నేల మీది నిజాలు కనిపిస్తుంటాయి వాస్తవ సమాచారం వస్తుంటుంది. ఆ సమాచారం ఉపయోగించుకునే స్టోరీలు, వార్తలు ఆ పాత్రికేయుడి కలం నుంచి, గొంతు నుంచి వస్తుంటాయి. నిజానికి సమాజం కోసం అలాంటి నిజాలు బయటపెట్టిన వారికే సమాజం సపోర్ట్ ఉంటుంది. దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది. దానిని అధికారం ఎంత తన కాలి కింద నలిపేయాలనుకున్న అది లేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ప్రజల కష్టాలే వార్తలుగా బతికి అలాంటి వార్తల కోసం జీవితం అంకితం చేసే వారికి, డబ్బులు సంపాదించడానికి ప్రభుత్వ చంకలో ఉండి ఎన్నో ఆఫర్‌లు ఉన్నా మీడియా సంస్థలు ఇలాంటి నిజాయితీ ఉన్న జర్నలిస్ట్‌‌లను భరించలేకపోతున్నాయి. కనీసం వారు రాసే వ్యాసాలు వేసుకోవడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి అనుభవాలు వ్యక్తిగతంగా నాకు ఎదురయ్యాయి.

ఎదుటి వాడు నిన్ను ఛాలెంజ్ చేసే స్థాయిలో వాడి జేబులో డబ్బు, చేతిలో అధికారం ఉండొచ్చు కానీ, గుండెలో ధైర్యం, గొంతులో దమ్ము ఉంటే కలం దెబ్బకు గన్ను అయినా ముడుచుకోవాల్సిందే. ఇప్పటికీ సమాజంలో మానవీయ కోణం ఉన్నా మనుషులు, మనసులు ఉన్నాయి. అదే ఎన్‌‌డీటీవీ రవీష్ కుమార్(NDTV Raveesh kumar) విషయంలో మరోసారి నిరూపితమైంది. ఆయన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన 24 గంటలలోనే 4 మిలియన్ల సబ్ క్రైబర్లు పొందారంటే ఆయన లాంటి ఆదర్శాలు ఉన్నవారు ఎందరో ఉన్నారు. 8 ఏండ్ల అధికారంలో కేంద్ర ప్రభుత్వం మీడియా మీద వాటి యాజమాన్యం ద్వారా ఎన్నో లోపాయికారి ఆంక్షలు, పెట్టింది. వ్యతిరేక వార్తల పట్ల నిఘా పెట్టింది. అలాంటి వార్తలకు పోటీగా యూట్యూబ్ ఛానల్స్, వాట్సాప్ గ్రూప్‌లు లక్షల్లో ఏర్పాటు చేసి ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియకుండా గందరగోళానికి గురి చేస్తున్నారు.

అక్కడ పనిచేసే వాతావరణం లేక

ఉత్తరప్రదేశ్ లో గంగా నదిని శుభ్రం చేసే ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు దాని కోసం కేటాయించిన బడ్జెట్ లో 62 శాతం డబ్బులు కేవలం ప్రచారానికి ఖర్చు చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలన్నారు, ఆ లెక్కన ఈ ఎనిమిది సంవత్సరాలలో 16 కోట్ల ఉద్యోగాలివ్వాలి కానీ కనీసం 16 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. నల్లధనం వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు, దేశంలోని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 7 వేల ఫ్యాకల్టీలను భర్తీ చేయలేదు, నోట్ల రద్దు, జీఎస్టీ ని(GST) తీసుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో 80 కోట్ల మంది ప్రభుత్వం ఇచ్చే రేషన్ మీద ఆధారపడి జీవించే పరిస్థితి వచ్చింది. ఇలా ఎన్నో వైఫల్యాలను మీడియా నిజాయితీగా రిపోర్ట్ చేయలేని పరిస్థితి దేశంలో ఉంది. ఒకవేళ రిపోర్ట్ చేసినా, చేసే వారి మీద ఐటీ, ఈడీ దాడులు. ప్రపంచంలోని మీడియా స్వేచ్ఛ ఇండెక్స్(Freedom of press index) లోనూ ఇండియా కిందనే ఉంది. నిజం రాసే, చెప్పే జర్నలిస్టులను జైళ్ళలో పెడుతున్నారు, వారికి బెయిల్ దొరకకుండా అడ్డుకుంటున్నారు. కేవలం ఎలక్షన్, అధికారం తప్ప ఏమి కనబడకుండా, వినబడకుండా ఉండే పరిస్థితి ఉంది. ఫక్తు హిందూ, ముస్లిం, మందిర్, మసీదు రాజకీయం చేస్తూ మనుషులుగా కలిసి ఉన్నవారిని విడదీసే విద్వేషాలు సృష్టించే ఉపన్యాసాలు ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి విద్వేషాలు సైతం మీడియాలో ప్రభుత్వం అనుకూలంగానే ప్రసారం చేయించుకుంటున్నారు.

దేశం అప్పులపాలైన, ప్రైవేటీకరణ వలన కోట్ల మంది ఉపాధి కోల్పోయినా, ఆ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇది ప్రస్తుత ప్రభుత్వ వైఖరి! అవినీతి, అక్రమాలు, అశ్రీత పక్షపాతాలు సంగతి ఇక అంతే. సమాజహితం, దేశహితం, దేశ ప్రజల హితంలో మీడియా ఉంటే పాలకులకు అదోరకమైన ఉక్రోషం అంటే అతిశయోక్తి కాదు. సహజంగానే ప్రజా ప్రతినిధులకు సైతం ప్రజల వైపు ఉండే పాత్రికేయుల మీద కోపం ఎక్కువగా ఉంటుంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే పరిస్థితి. అందుకే పీపుల్ జర్నలిస్ట్‌లు పనిచేసే వాతావరణం మీడియా యాజమాన్యాల దగ్గర లేని కారణంగా ఆయా సంస్థలను వదిలేసి తన గమ్యం వేటలో జర్నలిస్ట్ లు చాలామంది పడిపోతున్నారు. దానికి కొన్నిచోట్ల సమాజం ఊహించని కులం, మతం ఫ్యాక్టర్ కూడా ప్రధానంగా కనిపిస్తున్నది. అందుకే జర్నలిస్ట్ సమాజం బి యునైట్ అండ్ అలర్ట్. కనీసం లైక్ మైండెడ్ అయినా సమీక్షించుకుంటే మంచిది. గుండె ఉన్నది పిడికెడే అయినా బాధ్యత ఆకాశమంత అనేది గుర్తుంచుకోవాలి! క్యా పతా కబ్ అప్ని సాన్స్ అప్నా సాత్ చోడ్ దే..దిల్ ఏక్ మందిర్ బనాలో యార్ ( ఎవరికి తెలుసు ఎప్పుడు ఊపిరి మనల్ని వదిలి వెళ్లి పోతుందో! గుండె ను ఒక మందిరంగా మార్చుకో మిత్రమా ) చీలిపోతే ఓడిపోతాం! అనేది తెలిసీ కొందరు ఇలా చేస్తున్నారు బీ అలర్ట్.

ఎండి.మునీర్

సీనియర్ జర్నలిస్ట్

99518 65223

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Next Story

Most Viewed