స్పిన్ బౌలింగ్‌ టెక్నిక్‌తో.. అద్భుత ఆవిష్కరణ ఘూమర్

by Disha edit |
స్పిన్ బౌలింగ్‌ టెక్నిక్‌తో.. అద్భుత ఆవిష్కరణ ఘూమర్
X

లైఫ్.. లాజిక్ గేమ్ కాదు మ్యాజిక్ గేమ్. కానీ ఆ మ్యాజిక్‌ మన జీవితంలో ఎప్పుడు కనిపిస్తుంది? ఆత్మ విశ్వాసం, అంధ విశ్వాసానికి మధ్య తేడా ఏంటి? లూజర్ ఎలా ఫీల్ అవుతాడో తెలిసిన నేను.. విన్నర్ అనుభూతి తెలుసుకోగలనా? జిందగీ నా ముఖం మీద తలుపు వేసేసింది? దాన్ని నార్మల్‌గా ఓపెన్ చేయాలా లేక బద్ధలు కొట్టాలా? అది కూడా ఎలా సాధ్యం? ఇండియన్ టీమ్‌కు సెలెక్ట్ అయిన ఉమన్ క్రికెటర్ అనుకోని పరిస్థితుల్లో రైట్ హ్యాండ్ కోల్పోతే.. తన మదిలో ఇలాంటి ప్రశ్నలే మెదులుతాయి కదా? చావుకు, బతుకుకు మధ్య ఆలోచనలు ఊగిసలాడుతాయిగా? అలాంటి అమ్మాయి మళ్లీ ఎలా రేజ్ అయింది? ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్‌లో ఏవిధంగా స్థానం దక్కించుకుంది? అనేదే మోటివేషనల్ ఫిల్మ్ ‘Ghoomer’ కథ. కాగా డైరెక్టర్ R Balki ఎప్పటిలాగే మరో మాస్టర్ పీస్‌ను ప్రజెంట్ చేసి.. ప్రేక్షకులను స్పీచ్‌లెస్‌గా మార్చేశాడు. ఎమోషనల్ రీఛార్జ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కాన్సంట్రేషన్ మీద కాన్సంట్రేట్ చేస్తే ఏదీ అసాధ్యం కాదనే పాఠం చెప్పాడు.

కథేంటంటే

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నానమ్మ, తండ్రి, ఇద్దరు బ్రదర్స్‌తో కూడిన అందమైన ప్రపంచం ఆ అమ్మాయిది. ఇండియా తరఫున క్రికెట్‌ ఆడాలనేదే ఆమె కోరిక. ఆ వైపుగా కష్టపడుతుండగా.. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తుంటారు. ఇక తాను నేషనల్ సెలక్షన్స్ ఆడుతుండగా సెలెక్షన్ కమిటీ సభ్యుల్లో ఒకరు ఆమె ఆటకు ఫిదా అవడంతో.. ఈజీగానే ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్ ఉమన్ ఇంటర్నేషనల్ టీమ్‌లో ప్లేస్ దక్కించుకుంటుంది. నెక్స్ట్ డే ఇంగ్లాండ్‌ సిరీస్‌ ఆడేందుకు ప్రయాణం కాబోతుండగా.. అంతకు ముందు రోజు ఓ కారు యాక్సిడెంట్‌లో కుడి చేయి పోగొట్టుకుంటుంది. దీంతో ఒక్కసారి జీవితం తలకిందులు అయిపోతుంది. చీకటి గదికి పరిమితమై.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంది. ఆ టైమ్‌లోనే తన జీవితంలో వెలుగులు నింపేందుకు ఎంటర్ అవుతాడు ఎక్స్ క్రికెటర్. ఇంతకీ ఆయన ఏం చేశాడు? రైట్ హ్యాండ్ కోల్పోయిన అమ్మాయి.. మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్‌లోకి ఎలా ఎంటర్ అయింది? పది నెలల్లోనే ఇదంతా ఎలా సాధ్యమైంది? అసలు ఆ కారు యాక్సిడెంట్‌కు కారణం ఎవరు? చిన్నప్పటి నుంచి తనను ఆరాధించిన అబ్బాయి ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతుంటాడు? నానమ్మ చెప్పిన బోధనలు ఏంటి? నాన్న, అన్నదమ్ముల ఆరాటం ఏంటి? ఫైనల్‌గా ‘Ghoomer’ అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కుడి చేయి లేని లోపం స్పిన్ బౌలింగ్‌ టెక్నిక్‌లో ఒక అద్భుత ఆవిష్కరణకు ఎలా దారితీసింది? అనేది చాలా ఎమోషనల్‌గా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్.

ఫెయిల్యూర్‌ను సక్సెస్ చేయడంలో..

ఈ సినిమా ఇన్‌స్పిరేషన్, డెడికేషన్, డిటెర్మినేషన్, హోప్, టాలెంట్, కాన్ఫిడెన్స్, హార్డ్ వర్క్, ఎక్స్‌పీరియన్స్.. ఒకరి జీవితంలో ఎంత అవసరమో వివరించింది. అలాగే కొన్నిసార్లు ఫన్నీ.. మరికొన్ని సార్లు ఎమోషన్.. కొన్ని ఇష్టాలు.. మరికొన్ని రిగ్రెట్స్.. లైఫ్‌లో అన్ని సహజం. రేపు జరగబోయే దాన్ని ఊహించలేం. కాబట్టి సవాళ్లను ఎదుర్కొనేందుకు, జీవితంలో మ్యాజిక్ క్రియేట్ చేసుకునేందుకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పాజిటివిటీ ఎంత అవసరమో సైతం స్పష్టం చేసింది. ఒకరి సక్సెస్ అచీవ్‌మెంట్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ పాత్ర ఎంత గొప్పగా ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా చూపించింది. ఈ సినిమా మొత్తానికి తన లైఫ్‌లో ఉన్న నెగెటివిటీని పోగొట్టుకునేందుకు మరొకరి జీవితాన్ని పాజిటివ్ వేలో నడిపించడమే అసలు విజయం అని నిరూపించింది.

ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేసిన సయామీ ఖేర్ రియల్ లైఫ్‌లో క్రికెటర్ కావడం సినిమాకు కలిసొచ్చింది. ఇంతకు ముందు గ్లామరస్ క్యారెక్టర్స్ మాత్రమే చేసిన అమ్మాయి.. అసలు లైఫ్‌లో ఏం మిగిలిందనే టైమ్‌లో పలికించిన హావభావాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇలాంటి పాత్రలే ఆమెను వెతుక్కుంటూ వస్తే మరో లేడీ సూపర్ స్టార్‌గా మారడం పక్కా. జూనియర్ బచ్చన్ అభిషేక్‌ పాత్ర మూవీని మరో లెవల్‌కు తీసుకెళ్లింది. జీవితంలో ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉన్న ఆయన.. ఒక అమ్మాయి ఫెయిల్యూర్‌ను సక్సెస్ దిశగా తీసుకెళ్లే క్రమంలో ఆయన పడిన తపన, కఠినమైన ప్రవర్తనను చూస్తుంటే.. బాలీవుడ్ ఇన్నాళ్లు అతన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదనిపిస్తుంది. అలాగే పాత్ర నిడివి తక్కువగా ఉన్న తెరపై కనిపించిన ప్రతిసారి మనను ఇంప్రెస్ చేసే క్యారెక్టర్ షబానా అజ్మీ. లక్, సూపర్‌స్టిషన్‌ను నమ్మని, పాజిటివ్ మెంటాలిటీ కలిగిన నానమ్మ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది.

(ఈ సినిమా జీ-5లో అందుబాటులో ఉంది)

సుజిత రాచపల్లి

6305667783

Next Story

Most Viewed