ఈ శ్రమ దోపిడీ ఇంకెన్నాళ్ళు?

by Disha edit |
ఈ శ్రమ దోపిడీ ఇంకెన్నాళ్ళు?
X

ప్రైవేట్ గురువుల పరిస్థితి దినదిన గండంగా మారింది. విద్యార్థుల తల్లిదండ్రులను యాజమాన్యాలు అందిన కాడికి దోచుకుంటూ ప్రైవేట్ టీచర్లకు అన్యాయం చేస్తున్నారు. ఆర్థిక, శ్రమ దోపిడీకి యదేచ్ఛగా పాల్పడుతున్నాయి. సకాలంలో జీతాలు చెల్లించకుండా ప్రైవేట్ విద్యాసంస్థలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయి. పేరెంట్స్ జేబులు పిండి 12 నెలల ఫీజు వసూలు చేసి టీచర్లకు మాత్రం పది నెలల జీతాలను మాత్రమే ఇస్తున్నాయి. ఇది దోపిడీ కాదా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రైవేటు పాఠశాలల దోపిడీ అంతా ఇంతా కాదు. ప్రైవేట్ యాజమాన్యాలు తమ ఆస్తులను పెంచుకుంటూ ప్రైవేటు గురువులకు మాత్రం జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు. భద్రత లేని ఉద్యోగంతో దినదిన భయంగా గురువులు జీవితాన్ని వెల్లడిస్తున్నారు.

ఉన్న విద్యాసంస్థలు వేతనాలు కూడా ఇవ్వని నేపథ్యంలోనే కొత్త విద్యాసంస్థలు ఎన్నో పుట్టుకొస్తున్నాయ్. రాత్రికి రాత్రి క్యాంపస్ మార్చడం, పర్మిషన్ లేకుండా విద్యాసంస్థలు నడపడం తక్కువ జీతం ఇచ్చి వారిని తీసుకోవడం, అర్థంతరంగా గురువులను మధ్యలోనే తొలగించడం లాంటి ఎన్నో అక్రమాలు చేస్తున్నారు. యాజమాన్యాలు డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తాం అని చెప్పి కల్లబొల్లి మాటలు గారడీ మాటలు మాట్లాడే ముందు గురువులకు రావాల్సిన జీతాలు ఇవ్వండి. రెండు రాష్ట్రాల్లోనూ విద్య వ్యాపారంగా మార్చి ప్రైవేట్ ఉపాధ్యాయులను నిలువు దోపిడీ చేస్తున్నారు. కళాశాలల్లో సరైన గదులు, అర్హులైన ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలు లేకుండానే విద్యాశాఖ అధికారులు లక్షల్లో లంచాలు పుచ్చుకొని అక్రమంగా ప్రైవేట్ విద్యాసంస్థలు పర్మిషన్లు పొందుతున్నాయి. సర్కారు విద్యాసంస్థల్ని విద్యాశాఖ అధికారులే నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అడ్డుకట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రతినెల ఐదో తేదీలోగా వేతనాలు ఇచ్చేలా చూడాలి. అలాగే ప్రతి సంవత్సరం ప్రైవేట్ విద్యా సంస్థల గురువులకు వేతనాలను కూడా పెంచాలి. పీఎఫ్‌ను పునరుద్ధరించాలి. విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ సంస్థలపై తరచూ దాడులు నిర్వహించాలి. ప్రభుత్వ నిబంధనలు కష్టంగా కచ్చితంగా అమలు చేసేట్టుగా చూడాలి.

రావుల రాజేశం

లెక్చరర్

7780185674

Next Story

Most Viewed