కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు..

by Disha edit |
కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు..
X

మాతృస్వామిక దేశం మనది. మాతృ దేవో భవ ,పితృ దేవో ,ఆచార్య దేవో భవ అంటూ స్త్రీ గౌరవానికి అగ్రతాంబూలం ఇచ్చిన దేశం మనది. అందుకే మన దేశాన్ని కూడా భరతమాత అని సంబోధించి మహిళా గౌరవానికి ఎనలేని ప్రధాన్యతనిస్తాం. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని నానుడి. స్త్రీని దేవతతో సమానంగా పూజించే భారతావనిలో మహిళలపై వేధింపులు నిత్యకృత్యమయ్యాయి.

కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ఆడవారిపై ఏదో ఒక ఘాతుకం. హత్యచారమే కావచ్చు, వేధింపులే కావచ్చు. పొద్దున్నే లేచి టీవీ ఆన్ చేయగానే పలానా రాష్ట్రంలో, పలానా ప్రాంతంలో సామూహిక హత్యాచారం అని రోజూ చూస్తూనే ఉన్నాం. యావత్ భారతావనిని తీవ్ర వేదనకు గురి చేసిన నిర్భయ ఘటన తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుందని భారతదేశమంతా ఊహించింది. సాధారణ జనం మొదలుకొని వీఐపీ శ్రేణి పౌరులు కూడా రోడ్లపైకి వచ్చి ఇలాంటి భారతావని కాదు హత్యచారాలు లేని భారతదేశం కావాలని ముక్తకంఠంతో నినదించారు. నిర్భయ ఘటన జరిగినా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అలాంటి ఘటన జరగకుండా నిర్భయ చట్టానికి రూపకల్పన చేసింది. అయితే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే నిర్భయ చట్టం వచ్చాక ఇంకా ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా అధిక స్థాయిలో చోటుచేసుకోవడం బాధాకరం. కఠినమైన శిక్షలు ఉన్నా, కామందుల ఆలోచనల్లో మాత్రం మార్పు రాకపోవడం దురదృష్టకరం.కామందుల ఆలోచనల్లో మార్పు రానంత వరకు ఎన్ని చట్టాలు తెచ్చిన కూడా వృధానే.

అప్పుడే నిజమైన స్వాతంత్రం

దేశవ్యాప్తంగా చిన్నారులను మొదలుకొని పండు ముదుసలి వరకు కామందులు చేరుస్తూనే ఉన్నారు. కలకత్తాలో మూడేళ్ళ చిన్నారి ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా బస్ కండక్టర్ చిన్నారిని అపహరించి హత్యాచారం చేయడం చూస్తే ఎలాంటి భద్రత లేని సమాజంలో మహిళా ఉందో అర్థం అవుతుంది. ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా బయటకి వచ్చే వార్తలు కొన్నే, పరువు, ప్రతిష్టలను ఆత్మగౌరవాన్ని,ఆత్మాభిమానాన్ని చంపుకొని జీవచ్చవంలా జీవిస్తున్న మహిళలెందరో? ప్రతి స్త్రీలో మాతృమూర్తిని దర్శించే భారతదేశంలో ఆడవాళ్ళపై హత్యచారాలు అధికమవ్వడం ఆందోళన కలిగించే విషయం. సినీమాలతో, వెబ్ సిరీస్ తో ఆశ్లీలతను మరింత దగ్గరగా చూపి ఇస్తున్నారు. అర్ధరాత్రి ఏ భయం లేకుండా స్త్రీ ఒంటరిగా ఎప్పుడైతే రోడ్లపై వెళ్తుందో అప్పుడే భారతావనికి నిజమైన స్వాతంత్య్రం అని మహాత్ముడు అంటే కనీసం పట్టపగలు ఒంటరిగా తిరిగే పరిస్థితులు లేవంటే పరిస్థితులు ఎంత దిగజరాయో అర్థం అవుతుంది.

గల్లీ అబ్బాయిల నుండి..

మహిళలను కించపరుస్తున్నవారు చాలా మందే ఉన్నారు. గల్లీలో తిరిగే అబ్బాయిల నుంచి రాజకీయ నేతల వరకు మహిళలను వేధిస్తున్నారు. మహిళల పట్ల ప్రవర్తన దుర్మార్గంగా ఉందని చెప్పడానికి ఆ పార్టీ కీలక నేతలు చేసిన కొన్నివ్యాఖ్యలు పరిశీలిద్దాం. మహిళలు కనుక స్వేచ్చను కోరుకుంటే నగ్నంగా ఎందుకు తిరగడం లేదని, వారి స్వేచ్ఛను హరించి వేసే విధంగా, స్వేచ్ఛ అనే పదానికి కూడా తిలోదకాలు ఇచ్చారు హర్యానా సీఎం ఖట్టర్. ఎన్డీఏ తొలి హయాంలో దేశ ఆర్థిక మంత్రివర్యులు అరుణ్ జైట్లీ ఢిల్లీలో జరిగిన ఉదంతంపై మాట్లాడుతూ మానభంగంపై ప్రచారం చాలు, వేల కోట్ల డాలర్ల నష్టం కలగడానికి అంటూ మహిళను వ్యాపార వస్తువుగా చిత్రీకరించే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇక ఉపన్యాసం మొదలెడితే తను స్త్రీ పక్షపాతినని చెప్పుకునే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మహిళా స్వేచ్ఛ వినాశనానికి పునాది అంటూ మహిళను ఇంకా బందీగానే ఉంచాలనే ఆలోచనల్లో ఉన్నట్లు అర్థం అవుతుంది. మహిళను తీవ్ర ఆగ్రహానికి,ఆవేదనకు గురి చేసే వ్యాఖ్యలు చేశారు మరో బీజేపీ నేత బాబులాల్ గౌర్. కొన్ని సమయాల్లో మానభంగం సరైనదేనట.కొన్ని సమయాల్లో మాత్రమే తప్పట. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ బానే ఊపుతున్నావని, మహబూబ్ నగర్ జడ్పీ చైర్మన్ మహిళలను కత్తిలా ఉన్నావని, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఒక కలెక్టర్ చెయ్యి పట్టుకోవడం.. ఇలా ఎన్నో సంఘటనలు.

మహిళకే ప్రాధాన్యతనిస్తూ..

మహిళా సాధికారత సాధ్యమైనప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళకే అధిక ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలు అన్నీ కూడా మహిళలకే అందిస్తుంది. రేవంతన్న ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీ ప్రారంభించి విజయవంతం చేశారు. వంద రోజులు గడవక ముందే మరో రెండు హామీలు ఆడబిడ్డలకు కానుకగా రేవంత్ అన్న అందించారు. జీరో కరెంట్ బిల్లు మరియు 500 రూపాయలకే సిలిండర్ మా అక్కాచెల్లెళ్లకు అందించినారు.ఇలానే తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఆర్థిక పరిపుష్టితో ఎదగాలన్న ఇందిరాగాంధీ లక్ష్యం రేవంతన్న ప్రజాపాలనలో నెరవేరుస్తున్నారు. ఇంట్లో మహిళ ఆనందంగా ఉంటేనే ఆ ఇల్లు సుభిక్షం.

ఇందిరా శోభన్

కాంగ్రెస్ నాయకురాలు



Next Story

Most Viewed