మహిళలంటే గౌరవం లేని పార్టీ బీజేపీ! దానికి ఇవే సాక్ష్యాలు

by Disha edit |
మహిళలంటే గౌరవం లేని పార్టీ బీజేపీ! దానికి ఇవే సాక్ష్యాలు
X

హిమాచల్‌ప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో డేరా బాబా అలియాస్ రామ్ రహీమ్ అలియాస్ గుర్మిత్‌ను కూడా జైలు నుంచి 40 రోజుల పెరోల్ మీద బయటకు తీసుకొచ్చారు. ఇద్దరు మహిళల రేప్, ఇద్దరి హత్య కేసులలో డేరా బాబా జైలులో ఉన్నాడు. గత ఫిబ్రవరిలోనూ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 21 రోజుల పెరోల్ మీద బయటకు తెచ్చారు. సకల సౌకర్యాలు ఏర్పాటు చేసారు. ఇదీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మంత్రుల పరిస్థితి. రేపిస్టులను వెనుకేసుకురావడం, విద్వేషాలు రెచ్చగొట్టేలా మతపర స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం బీజేపీలోని కొందరు ప్రజా ప్రతినిధులకు, కొందరు మంత్రులకు పరిపాటిగా మారింది. ఇలాంటి చర్యలు, విధానాలతో అధికారం చేపట్టాలని, ఉన్న అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ భావిస్తున్నది.

దేశంలో నేతలకు మహిళలంటే గౌరవం లేకుండా పోతున్నది. బీజేపీలోనైతే అస్సలు గౌరవం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాల్ ఖిలా నుంచి మాట్లాడుతూ మహిళలకు గౌరవం ఇవ్వాలని అంటారు. మహిళల సంరక్షణ గురించి మాట్లాడుతారు. దేశంలో మహిళల మీద జరుగుతున్న దాష్టీకాల మీద మాత్రం పెదవి విప్పరు. మహిళా మంత్రులు మౌనంగా ఉంటారు. కేంద్రం సహా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కొందరు మంత్రుల వ్యవహారం ఆందోళన కలిగిస్తున్నది.

తాజాగా కర్ణాటకలోని చమ్రాజ్‌నగర్ జిల్లాలో జరిగిన భూమి పట్టాల పంపిణీ కార్యక్రమంలో తన సమస్య చెప్పడానికి వచ్చిన ఒక మహిళ చెంపను మంత్రి వి.సోమయ్య చెళ్లుమనిపించారు. ఈ సంఘటన ఈ నెల 22 శనివారం జరిగింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ కాగా, ఆమె తన కాళ్లు పట్టుకుని అడుగుతుంటే, లేపే క్రమంలో తన చేయి తాకిందని అంటారు మంత్రి. చెంప మీద కొట్టిన తరువాతే ఆమె మంత్రి కాళ్లు పట్టుకుంటున్న దృశ్యం చాలా క్లియర్‌గా వీడియోలో రికార్డు అయ్యింది.

తీరని అన్యాయం

ఇక దేశమంతా ఎరిగిన బిల్కిస్‌ బానుకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకుందాం. 'బేటీ బచావో, బేటీ పఢావో' కార్యక్రమం ప్రారంభించినప్పుడు వంద కోట్లకు పైగా ప్రచారానికి, హోర్డింగులు, ప్రకటనలకు ఖర్చు చేసారు. దీనికి బడ్జెట్ కూడా కేటాయించారు. బిడ్డలకు కష్టం వచ్చినప్పుడు మాత్రం పట్టించుకునేవారే లేరు. బిల్కీస్‌ బాను విషయంలో అధికార పార్టీ నేతలు ఎవ్వరూ ఎందుకో నోరు మెదపడం లేదు. ఎందుకింత నిర్లక్ష్యం? ఆమె ఈ దేశం బిడ్డ కాదా? ఈ ఏడాది అమృత్‌కాల్ సందర్భంగా పంద్రాగస్టు నాడు లాల్ ఖిలా నుంచి మహిళల గౌరవం గురించి మాట్లాడిన పీఎం నరేంద్ర మోడీ మాటలు ఆమెకు వర్తించవా?

బిల్కిస్‌ బాను దుఃఖం ఈ దేశం మహిళల దుఃఖం కాదా? ఆమెను రేప్ చేసి, ఆమె పసిబిడ్డను గోడకేసి కొట్టి చంపి, కుటుంబ సభ్యుల మీద మారణకాండకు పాల్పడిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న 11 మందిని శిక్ష పూర్తి కాకముందే గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం మీద దేశమంతా ఆందోళన వ్యక్తం అయ్యింది. పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా వేసారు. సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. కేంద్రం ఆమోదం తెలిపిన తరువాతనే, నిబంధనల ప్రకారమే వారిని విడుదల చేశామని రాష్ట్ర ప్రభుత్వం జవాబిచ్చింది.

Also read: మోనోపాలి దిశగా భారతదేశం! ప్రత్యామ్నాయం ఏంటి?

తీరు మారని దోషులు

బిల్కీస్ బాను కేసులో దోషుల విడుదలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమర్ధించారు. మంత్రి మాటలు వివాదాస్పదంగా మారాయి. ఒక మైనారిటీ మహిళ కేసులో దోషులను వెనకేసుకు రావడం మీద మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసాయి. ప్రధాని, హోమ్ మంత్రి సొంత రాష్ట్రం గుజరాత్‌లో జరిగిన బిల్కీస్ బాను లాంటి దారుణ సంఘటన దోషుల పట్ల ఇంత ప్రేమ ఎందుకు? విడుదలయ్యాక వారికి సన్మానాలు చేసారు. మహిళలు తిలకం దిద్ది హారతులు పట్టారు. వారు బ్రాహ్మణులని, తప్పు చేయరని బీజేపీ నేత ఒకరు మాట్లాడారు. ఇంత జరుగుతున్నా అడిగేవారు లేరు. పీఎం మాట్లాడరు.

ఈ 11 మంది పెరోల్ మీద బయటికి వచ్చారు. పోయారు. ఒక్కొక్కరు మూడున్నర నుంచి నాలుగున్నర యేండ్లు బయటనే ఉన్నారు. బయటకు వచ్చినప్పుడు ఒకరు ఒక మహిళ మీద అత్యాచారం చేయబోయారని కూడా కేసు నమోదైంది. పలువురి మీద కొందరిని బెదిరించిన ఫిర్యాదులూ ఉన్నాయి. వీరి విడుదల సరి కాదని చాలా మంది న్యాయ నిపుణులు, రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Also read: కార్పొరేట్ అనుకూల ప్రభుత్వం కోసమే ఇదంతా!

ఆమె బతికి ఉంటే

హిమాచల్‌ప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో డేరా బాబా అలియాస్ రామ్ రహీమ్ అలియాస్ గుర్మిత్‌ను కూడా జైలు నుంచి 40 రోజుల పెరోల్ మీద బయటకు తీసుకొచ్చారు. ఇద్దరు మహిళల రేప్, ఇద్దరి హత్య కేసులలో డేరా బాబా జైలులో ఉన్నాడు. గత ఫిబ్రవరిలోనూ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 21 రోజుల పెరోల్ మీద బయటకు తెచ్చారు. సకల సౌకర్యాలు ఏర్పాటు చేసారు. ఇదీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మంత్రుల పరిస్థితి. రేపిస్టులను వెనుకేసుకురావడం, విద్వేషాలు రెచ్చగొట్టేలా మతపర స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం బీజేపీలోని కొందరు ప్రజా ప్రతినిధులకు, కొందరు మంత్రులకు పరిపాటిగా మారింది. ఇలాంటి చర్యలు, విధానాలతో అధికారం చేపట్టాలని, ఉన్న అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ భావిస్తున్నది.

నిరుద్యోగం, అసమానతలు, అధిక ధరల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ఎలాంటి చర్యలకైనా బీజేపీ సిద్దమే. కనీసం ప్రజల భయం కూడా లేకుండా క్రిమినల్స్‌కు మద్దతుగా నిలబడడం ఏమిటో? ప్రతీ విషయానికి రెచ్చిపోయి మాట్లాడే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హత్రాస్ సంఘటన మీద నోరు మెదపలేదు. ఈ సమయంలో తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ ఉండి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. ప్రతిపక్షంలో ఉండి సమస్యల మీద ఆమె పార్లమెంటులో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ నేత సోనియాగాంధీ ఆమెను అభినందించేవారు. తెలంగాణ కోసం యువత ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు, ఉద్యమం గురించి పార్లమెంటులో సుష్మా మాట్లాడిన తీరును ఎలా మర్చిపోగలం? 2012లో నిర్భయకు న్యాయం చేయాలని కదిలిన దేశం ఇప్పుడు చలనం లేకుండా ఎందుకు ఉంది?


ఎండీ. మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223

Next Story

Most Viewed