'ఊహించిన దానికంటే అత్యంత వేగంగా రికవరీ'!

by  |
ఊహించిన దానికంటే అత్యంత వేగంగా రికవరీ!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి వల్ల దెబ్బతిన్న భారత ఆర్థికవ్యవస్థ అంచనాలకు మించి వృద్ధిని సాధిస్తోందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం చెప్పారు. విద్యుత్ డిమాండ్ పెరగడం, జీఎస్టీ వసూళ్లు 8 నెలల గరిష్ఠానికి చేరుకోవడం, ఆటో పరిశ్రమలో విక్రయాలు పుంజుకోవడం లాంటి పరిణామాలు వృద్ధికి నిదర్శనమని అన్నారు. అంతేకాకుండా, రైళ్లలో సరుకు రవాణా కూడా పెరిగిందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సైతం పెరిగాయని ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు.

వీటిన్నిటినీ గమనిస్తే దేశ ఆర్థికవ్యవస్థ రికవరీ అత్యంత వేగంగా ఉన్నట్టు కనిపిస్తోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఆశాజనకంగా ఉందన్నారు. ఊహించిన దానికంటే వేగంగా ఆర్థికవ్యవస్థ రికవరీ కనిపిస్తోందని, భారీ వర్షాలతో వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం తగ్గినా, రైళ్లు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగనప్పటికీ డిమాండ్ పెరగడం ఉత్పత్తి పెరుగుదలకు సాక్ష్యాలని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ, రైల్వే రంగాల్లో విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ 12 శాతం పెరిగిందని, ఇది ఉత్పత్తి సాధారణ స్థితికి చేరుకోవడాన్ని సూచిస్తోందన్నారు.



Next Story

Most Viewed