విండీస్ బౌలర్ల ధాటికి కష్టాల్లో ఇంగ్లండ్

by  |
విండీస్ బౌలర్ల ధాటికి కష్టాల్లో ఇంగ్లండ్
X

దిశ, స్పోర్ట్స్: బయో సెక్యూర్ వాతావరణంలో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండోరోజు ఆసక్తికరంగా మారింది. తొలిరోజు వర్షం కారణంగా కేవలం 17.4 ఓవర్లపాటు మాత్రమే మ్యాచ్ కొనసాగగా ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరుతో ఇవాళ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టును విండీస్ బౌలర్లు బెంబేలెత్తించారు. షానన్ గాబ్రియేల్ రెండు వికెట్లు తీశాడు. తొలి సెషన్ ప్రారంభమైన కాసేపటికే షానన్ గాబ్రియేల్ బౌలింగ్‌లో జో డెన్లీ (58 బంతుల్లో 18) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే, నిలకడగా ఆడుతున్న ఓపెనర్ రోరీ బెర్న్స్ (85 బంతుల్లో 30)ను కూడా గాబ్రియల్ ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్ చేర్చాడు. ఇక ఆ తర్వాత విండీస్ కెప్టెన్ హోల్డర్ బంతితో చెలరేగి పోయాడు. జాక్ క్రాలీ (26 బంతుల్లో 10), ఒలిన్ పోప్ (13 బంతుల్లో 12)లను పెవీలియన్ పంపించాడు. దీంతో లంచ్ సమయానికి ఇంగ్లండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (62 బంతుల్లో 21), జోస్ బట్లర్ (12 బంతుల్లో 9) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.



Next Story

Most Viewed