నిద్రపోతూ డబ్బు సంపాదిస్తున్న టిక్‌టాకర్లు

by  |
నిద్రపోతూ డబ్బు సంపాదిస్తున్న టిక్‌టాకర్లు
X

దిశ, వెబ్‌డెస్క్:
చాలా మందికి రాత్రి పడుకుని ఉదయం లేచేసరికి ధనవంతులు అయిపోతే బాగుండని అనిపిస్తుంటుంది. సోషల్ మీడియా యాప్ టిక్ టాక్‌ ద్వారా కొంతమంది అది నిజమవుతోంది. రోజుకో వింత ట్రెండ్ టిక్ టాక్‌లో వస్తుంటుంది. ఆ క్రమంలో కొత్తగా స్లీప్ స్ట్రీమింగ్ ట్రెండింగ్‌గా మారింది. కానీ ఈ ట్రెండ్‌తో లాభపడుతున్న టిక్ ‌టాకర్లు చాలా మంది ఉన్నారు.

ఏం చేయాలి?

ఈ స్లీప్ స్ట్రీమింగ్‌లో చేయాల్సిన పని పెద్దగా ఏమి ఉండదు. రోజు పడుకుంటున్నట్లుగానే పడుకోవాలి. కానీ దాన్ని టిక్ టాక్‌లో లైవ్ స్ట్రీమ్ పెట్టాలి. అది చూడటానికి వచ్చిన ఫాలోవర్లు డిజిటల్ కాయిన్స్ డొనేట్ చేస్తారు. ఆ కాయిన్లను తర్వాత డబ్బులుగా మార్చుకునే అవకాశం ఉంటుంది.

ఎందుకిలా?

సాధారణంగా సెలెబ్రిటీల సొంత విషయాలు తెలుసుకోవాలని అభిమానులకి ఉంటుంది. టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంతోమంది ఓవర్ నైట్ సెలెబ్రిటీలు అవుతున్నారు. అయితే వారి వ్యక్తిగత విషయాలు అంటే ఎలా తింటారు? ఎలా పడుకుంటారు? అనేవి కూడా తెలుసుకునే కుతూహలంతో ఈ స్లీప్ స్ట్రీమింగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

అయితే మామూలు పేరు తెచ్చుకున్న టిక్ టాకర్ల స్లీప్ స్ట్రీమింగులు కూడా ట్రెండ్ అవడం కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. అయితే టిక్ టాక్‌లో ఈ స్లీప్ స్ట్రీమింగ్ తర్వాత సేవ్ అవదు. అంతేకాకుండా కొత్త పరిచయాలు పెంచుకుని వారితో డైరెక్టుగా గ్రూప్ చాట్ చేయడానికి ఈ స్లీప్ స్ట్రీమింగులు ఉపయోగపడుతున్నాయి. డైరెక్టు మెసేజ్ చేసే సదుపాయం టిక్ టాక్‌లో లేకపోవడం, స్లీప్ స్ట్రీమింగ్ రికార్డు కాకపోవడం వినియోగదారులకు మంచి అవకాశంగా దొరికింది. దీంతో స్లీప్ స్ట్రీమింగ్‌ మంచి పాపులర్ అయిందని సోషల్ మీడియా విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఈ ట్రెండు ఉన్నన్ని రోజులు డబ్బులు వెనకేసుకోవాలని టిక్ టాక్ సెలెబ్రిటీలు ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags: Tik Tok, Sleep Streaming, Sleep earn, money, digital coins, night sleep, live stream, Group chat



Next Story

Most Viewed