‘అత్యవసర ప్రయాణికులకు ఈ-పాస్‌లు’

by  |
‘అత్యవసర ప్రయాణికులకు ఈ-పాస్‌లు’
X

దిశ, ఏపీ బ్యూరో: అత్యవసర ప్రయాణికులకు ఈ-పాస్‌లు జారీ చేస్తున్నామని ఏపీ డీజీపీ కార్యాలయం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్ నిబంధనలు అమలవుతున్న నేపథ్యంలో.. అత్యవసర వైద్య చికిత్స కోసం, కుటుంబంలో ఎవరైనా మరణిస్తే, సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణ తదితర అత్యవసర పనులపై ప్రయాణించాలనుకునే వారికి ఈ-పాస్‌లు జారీ చేయనున్నట్టు, అవసరమైనవారు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ డీజీపీ కార్యాలయం ప్రకటించింది. ఈ-పాస్‌ల కోసం https:citizen.appolice.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇందుకు సమర్పించిన వివరాలను పోలీసులు ఆమోదిస్తే దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్, మెయిల్ ఐడీకి వాహన అత్యవసర పాస్‌ను పంపిస్తామని పోలీసు కార్యాలయం తెలిపింది.



Next Story

Most Viewed