షాకింగ్ : ‘డప్పు’ కూలి పెంచమన్నందుకు.. 70 దళిత కుటుంబాల బహిష్కరణ

by  |
dappu
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని గ్రామాభివృద్ధి కమిటీ అరాచకానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన. డప్పులు కొట్టేందుకు కూలి పెంచమన్నందుకు 70 కుటుంబాలను బహిష్కరించింది వీడీసీ. సర్పంచ్ పార్టీ మారిందని, దళితులను పార్టీ మారాలని కోరితే స్పందించకపోవడంతో గ్రామంలోని దళిత కుటుంబాలకు వీధిలైట్లు, మంచినీటి సరఫరా నిలిపివేశారు. కక్ష్య కట్టి వేధింపులకు గురి చేస్తున్న ఈ ఘటన బాధితుల ఫిర్యాదుతో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం దూస్‌‌ గామ్‌లో గ్రామాభివృద్ధి కమిటీ ఈ అరాచకానికి పాల్పడింది. కొత్తగా ఏర్పడిన వీడీసీకి గ్రామంలో డప్పుకొట్టే మాదిగ కులస్తులు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డప్పు కొట్టేందుకు కూలి రూ. 500 పెంచాలని కోరారు.

Download Disha App

ఈ విషయం పెత్తందారుల చేతిలో ఉన్న గ్రామాభివృద్ధి కమిటీకి రూచించలేదు. దానికి తోడు ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి చేరిన సర్పంచ్ శివారెడ్డి తోడయ్యారు. రాష్ర్ట ప్రభుత్వం దళితులకు ‘దళితబంధు’ అమలు చేస్తుండటంతో గ్రామంలోని దళితులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని 70 దళిత కుటుంబాలకు గ్రామ బహిష్కరణ విధించింది వీడీసీ. దూస్‌గాంకు చెందిన డప్పుల వారిని కాదని కూలస్ పూర్‌కు చెందిన వారిని రప్పించి పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆ విషయాన్ని ప్రశ్నించడంతో వీడీసీ దళిత కుటుంబాలకు వీధి లైట్లు, మంచి నీటి సరఫరాను కూడా నిలిపివేసి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో బాధితులు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. దూస్‌గాం సర్పంచ్‌తో పాటు వీడీసీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబేధ్కర్ దండోర యువజన సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.

Next Story

Most Viewed