బయో-సూట్ల ఉత్పత్తిని పెంచనున్న డీఆర్‌డీవో!

by  |
బయో-సూట్ల ఉత్పత్తిని పెంచనున్న డీఆర్‌డీవో!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. అయితే, వీరందరినీ వైరస్ బారి నుంచి రక్షించేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీవో సురక్షితమైన బయో-సూట్లను అభివృద్ధి చేసింది. పలు డీఆర్‌డీవో ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు తమ సాంకేతిక పరిజ్ఞానంతో ఫాబ్రిక్ కలిగిన రక్షణ పరికరాలతో నానో టెక్నాలజీ నపుణ్యంతో వీటిని తయారు చేశారు.

ఈ సూట్ పరిశ్రమ సహాయంతో తయారు చేయబడింది మరియు వస్త్ర పారామితుల కోసం పరీక్షకు లోబడి సింథటిక్ రక్తం (శరీర రక్తం యొక్క కొన్ని విధులను నెరవేర్చగల ప్రత్యామ్నాయం) నుండి రక్షణకు లోబడి ఉంది. సింథటిక్ రక్తం నుండి రక్షణ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ంఒహ్Fవ్) బాడీ సూట్లకు నిర్వచించిన ప్రమాణాలను మించిపోయింది.

వీటి తయారీలో అవసరమైన ముడి సరుకు, ఇతర పరికరాలను ఉత్పత్తి చేయడానికి కుసుమ్‌ఘర్ ఇండస్ట్రీస్ అనే సంస్థతో డీఆర్‌డీవో భాగస్వామ్యం అవుతోంది. రోజుకు 15,000 సూట్ల సామర్థ్యంతో ఉత్పత్తిని చేపట్టాలని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం రోజుకు 7 వేల సూట్ల ఉత్పత్తి జరుగుతోంది. అయితే, సీమ్ సీలింగ్ టేపిఉలు తగినన్ని అందుబాటులో లేకపోవడంతో బయో-సూట్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోందని డీఆర్‌డీవో పేర్కొంది. అయితే, ఇది ఉత్పత్తికి నిరోధం అవదని, ప్రత్యామ్నాయంగా జలాంతర్గామిలో వాడే సీలెంట్‌లను ఉపయోగించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Tags: Defence Research And Development Organisation, DRDO, Personal Protective Equipment, PPE, Kusumgarh Industries

Next Story

Most Viewed