తమ్ముడితో అన్నకు సందేశం పంపిన ద్రవిడ్

by  |
deepak chahar
X

దిశ, స్పోర్ట్స్: శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాహుల్ ద్రవిడ్ ఎప్పుడూ చాలా కూల్‌గా ఉంటాడు. తన పని తాను చేసుకొని పోతుంటాడు తప్ప.. మ్యాచ్ మధ్యలో కల్పించుకొని ఆటగాళ్ల రిథమ్ చెడగొట్టేలా సందేశాలు పంపడు. అయితే రెండో వన్డేలో భారత జట్టు 161 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో దీపక్ చాహర్ (69 నాటౌట్), భువనేశ్వర్ కుమార్‌తో కలసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒకానొక దశలో చాహర్ కాలికి తిమ్మిర్లు పట్టడంతో ఫిజియోను పిలిపించాడు.

ఆ సమయంలో ద్రవిడ్ ఒక సందేశాన్ని మైదానంలోకి పంపాడు. దీపక్ చాహర్ తమ్ముడు రాహుల్ చాహర్‌తో ఆ విషయాన్ని షేర్ చేశాడు. ‘శ్రీలంక స్పిన్నర్ హసరంగ చాలా ప్రమాదకరంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడి బంతులను ఆచితూచి ఆడాలి. అంతే కానీ అనవసరమైన షాట్లకు ప్రయత్నించి వికెట్ కోల్పోవద్దు’ అని ద్రవిడ్ మెసేజ్ పంపాడు. ఆ సందేశాన్ని చాహర్, భువీ ఇద్దరూ తూచా తప్పకుండా పాటించారు. హసరంగ బౌలింగ్ కోటా అయ్యే వరకు భారీ షాట్లను కొట్టలేదు. కానీ వేరే బౌలర్లపై మాత్రం ఎదురు దాడికి దిగి.. మ్యాచ్‌ను ముగించారు.

Next Story

Most Viewed