మందుబాబులకు అడ్డాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

by Sridhar Babu |   ( Updated:2021-10-07 06:04:38.0  )
మందుబాబులకు అడ్డాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
X

దిశ, దుమ్ముగూడెం: మండల పరిధిలోని తూరుబాక గ్రామ పంచాయతీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం దాదాపు పూర్తి అయి ఒక ఏడాది దాటింది. వీటిలో ఐదు ఇళ్లు నిర్మాణ దశలో ఉండగా కొంత మంది మందు బాబులు రోజు మద్యం తాగి అక్కడే సీసాలను పడేస్తున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించి 2 సంవత్సరాలు దాటినా.. ఇంకా ఇండ్ల నిర్మాణం పూర్తి కాక లబ్ధిదారులు ఇండ్లు ఇంకెప్పుడు కేటాయిస్తారని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ బాలసాని దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన కాంట్రాక్టర్ కు ఇళ్ల నిర్మాణం వెంటనే పూర్తి కావాలని అన్నారు. అయినా సరే ప్రజాప్రతినిధి చెప్పినా.. పనులు పూర్తి కాకపోవడం గమనార్హం.

Advertisement

Next Story