బీపీ, షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్.. నేరుగా మందులు డోర్ డెలివరీ

by  |
బీపీ, షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్.. నేరుగా మందులు డోర్ డెలివరీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్యశాఖలో కొత్త స్కీం అందుబాటులోకి రానుంది. బీపీ, షుగర్​ పేషెంట్లకు కిట్లు ఇవ్వనున్నారు. మందులను నేరుగా డోర్​ డెలివరీ చేసేందుకు అధికారులు ప్లాన్​ చేస్తున్నారు. డిసెంబరు నుంచి వీటిని పంపిణీ చేయాలని సిద్ధమయ్యారు. సాధ్యాసాధ్యాలపై మంత్రి హరీష్​రావు అధికారులతో శనివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అయితే వీటిని తొలి విడత 80 ఏళ్లు దాటిన వారికి ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేటగిరిలో సుమారు 18 కోట్ల మంది ఉంటారని వైద్యశాఖ అంచనా వేసింది. ఇప్పటికే వీరందరికీ బీపీ, షుగర్​తో పాటు క్యాన్సర్​ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు 20 లక్షల మందికి బీపీ, మరో 7 లక్షల మందికి షుగర్​ ఉన్నట్లు గుర్తించారు. వచ్చే నెల నుంచి వీరికి మందుల కిట్లు అందజేయనున్నారు. ఆ కిట్​లో నెలకు సరిపోయే మందులు, వాడాల్సిన విధానం కరపత్రాలను కూడా ఉంచనున్నారు.

Next Story

Most Viewed