డోర్ డెలివరీ చేసి.. అదనంగా 6 లక్షలు వసూలు

by  |
డోర్ డెలివరీ చేసి.. అదనంగా 6 లక్షలు వసూలు
X

దిశ, జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు డెలివరీ బాయ్స్ తో అదనపు చార్జీలను డబ్బు రూపంలో వసూలు చేయిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజెన్సీకి పది కిలోమీటర్ల లోపు దూరంలో నివసించే వినియోగదారులకు ఉచితంగా డోర్ డెలివరీ చేయాల్సి ఉండగా జహీరాబాద్ పట్టణం పరిసరాలలో గ్యాస్ డెలివరీ బాయ్స్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. గృహ వినియోగ సిలిండర్ ఒక్కొక్క గ్యాస్ డెలివరీ 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని శుక్రవారం ఉదయం పలువురు వినియోగదారులు చెప్పారు.

జహీరాబాద్ నియోజకవర్గంలో 15 వేలు, పట్టణంలో 30 వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు పలువురు వినియోగదారులు వివరించారు. 6 లక్షల రూపాయలను గ్యాస్ ఏజెన్సీ నిర్వహకులు డెలివరీ బాయ్స్ తో ఆదనంగా వసూలు చేయిస్తునారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్ని రకాల పన్నులు కలుపుకుని గృహ వినియోగ సిలిండర్ కు సుమారు రూ. 580 ధర నిర్ణయిస్తే, సంబందిత గ్యాస్ ఏజెన్సీ నిర్వహకులు 600 రూపాయలు వసూలు చేయించి లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేశారని మండిపడుతున్నారు. ఏజెన్సీ నిర్వహకులపై సంబందిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ పరిసర ప్రాంతాల గ్యాస్ వినియోగ దారులు కోరుతున్నారు.



Next Story

Most Viewed