ఫుడ్ కనిపిస్తే.. స్మైల్ ఇస్తున్న శునకం!

by  |
ఫుడ్ కనిపిస్తే.. స్మైల్ ఇస్తున్న శునకం!
X

దిశ, వెబ్‌డెస్క్ : వంటగదిలో అమ్మ చేసే వంట ఘుమఘుమలు.. అలా గాల్లోంచి హాల్లోకి వచ్చి మన ముక్కుపుటాలను చేరగానే, ‘ఆహా ఏమి’ రుచి.. అంటూ గట్టిగా ఆ ఆస్వాదిస్తాం. మనకు నచ్చిన ఫుడ్‌ను డైనింగ్ టేబుల్ మీద చూడగానే, వావ్.. ఈ రోజు ఓ పట్టుపట్టాల్సిందేనని అనుకుంటాం. ఇక బిర్యానీ పేరు చెబితే.. అలా గుటకలు మింగేస్తాం. ఐస్ క్రీం చూడగానే ఐసైపోతాం.. ఇలా ఆత్మారామున్ని సంతృప్తి పరిచే ఫుడ్ ఏది కనిపించినా, లేట్ చేయకుండా ఆరగిద్దామని అనుకుంటాం. ఇక ఇంట్లో ఎవరైనా మనకు ఇష్టమైన ఫుడ్ సర్‌ప్రైజ్‌గా అందిస్తే, అప్పుడు భలే ఆనందంగా ఉంటుంది కదూ! ఇలా మీరే కాదు.. నేను కూడా చేయగలనని అంటోంది ఓ బుజ్జికుక్క. మీకన్నా.. నాకేం తక్కువ? నేను గ్రేట్ ఫుడ్డీనే! అని ఓ నవ్వు నవ్వేస్తోంది.

ఇటీవల కాలంలో శునకాల భోగాలు చూస్తే మనిషి జీవితం కంటే వాటి జీవితాలే.. చాలా బెటర్‌గా ఉన్నట్లు అనిపిస్తోంది. జపాన్, టోక్యోలో నివసించే ‘యూని’ అనే కుక్క తనకు ఇష్టమైన ఫుడ్ తింటూ నెటిజన్ల మనసును దోచుకుంటోంది. ఈ శునకం ఎదురుగా దానికి ఇష్టమైన ఫుడ్ స్పాగెట్టి, పిజ్జా, నూడుల్స్, బుబుల్ టీ, ఐస్ క్రీమ్స్ ఇంకా రకరకాల ఫుడ్స్ పెడితే చాలు.. వాటిని హ్యాపీగా చూస్తూ ‘స్మైల్’ ఇస్తుంది. దాంతో ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయిపోయింది. అంతేకాదు షిబా యూని (shiba_uni_20190107) అనే దీని ఇన్‌స్టా అకౌంట్‌కు 101కె ఫాలోవర్స్ ఉన్నారు. దీని ఫుడ్ స్మైలింగ్ ఫొటోలకు లక్షల్లో లైకులు వస్తుంటాయి. నెట్టింట్లో ఇవి నిమిషాల్లో ట్రెండింగ్‌గా నిలుస్తాయి. దాదాపు యూని ఫోటోలన్నీ కూడా ఫుడ్ తినేవే ఉంటాయి. ఇది ‘షీబా’, ఇన్యు’ బ్రీడ్ నుంచి పుట్టింది. ఈ బ్రీడ్ శునకాలు జపాన్‌లో చాలా ఫేమస్. ఇవి మనుషులతో చాలా సులభంగా కలిసిపోతాయి.

https://www.instagram.com/shiba_uni_20190107/?utm_source=ig_embed

Next Story

Most Viewed