అమ్మ నన్ను క్షమించు.. చెరువులో దూకి డాక్టర్ సూసైడ్..

by  |
doctor suicide
X

దిశ, వెబ్‌డెస్క్ : అప్పుల బాధ భరించలేక యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ రాసి.. ఎల్లమ్మ చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన నేత్ర వైద్యుడు రాజేశ్​ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టి అదృశ్యమయ్కాడు. ఈ క్రమంలో శుక్రవారం హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు వద్ద రాజేశ్ చెప్పులు, మొబైల్ దొరికాయి.

ఈ క్రమంలో చెరువులో ఎంత గాలించినా రాజేశ్ మృతదేహం లభ్యం కాలేదు. అయితే శనివారం ఉదయం చెరువులో రాజేశ్ మృతదేహం పైకి తేలడంతో పోలీసులు అతడి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజేశ్ ఓ ప్రైవేటు క్లినిక్‌లో నేత్ర వైదుడిగా పని చేస్తున్నారు. అయితే తనకు మరణానికి ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. లేఖలో అమ్మ నన్ను క్షమించు మీకు నేను ఏం చేయలేకపోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Next Story

Most Viewed