మూడో సారి ప్రధానిగా గెలవడంపై అభినందనలు మోడీజీ!.. బిల్ గేట్స్ ట్వీట్

by Ramesh Goud |
మూడో సారి ప్రధానిగా గెలవడంపై అభినందనలు మోడీజీ!.. బిల్ గేట్స్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజల జీవితాలను బలోపేతం చేసేందుకు మోడీ యొక్క నిరంతర బాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నామని ప్రముఖ టక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ట్విట్టర్ వేదికగా మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. మూడో సారి ప్రధానిగా గెలుపొందడంపై నరేంద్ర మోడీకి అభినందనలు అంటూ..ఆరోగ్యం, వ్యవసాయం, మహిళల అభివృద్ధి, డిజిటల్ పరివర్తన వంటి రంగాలలో ఆవిష్కరణల మూలంగా ప్రపంచ పురోగతిలో భారతదేశ స్థానాన్ని మోడీ బలోపేతం చేశారని కొనియాడారు. అలాగే భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి మీ నిరంతర భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నామని బిల్ గేట్స్ అన్నారు.

Next Story

Most Viewed