పిల్లలకు గోడలు పాఠాలు చెబుతాయా?

by  |
YS Sharmila Twitter
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పాఠశాలలను పున: ప్రారంభిస్తున్న ప్రభుత్వానికి అందులో టీచర్లను కూడా భర్తీ చేయాలనే సోయి లేదా అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల శుక్రవారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. స్కూళ్లు ప్రారంభించాక పిల్లలకు గోడలు పాఠాలు చెబుతాయా అంటూ తెలంగాణ సర్కార్‌కు చురకలంటించారు. బడిలో సార్లుంటే ఏంటి? లేకుంటే ఏంటి? చదువుకున్నోళ్లకు ఉద్యోగాలుంటే ఏంటి? లేకుంటే ఏంటి? అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్కూళ్లలో టీచర్లు లేకుంటే పిల్లలకు చదువులుండవు, పాసయ్యేది ఉండదు. ఉద్యోగాలడిగే అవసరం అంతకన్నా ఉండదనే భావనలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. అందుకే టీచర్లను నియమించకుండా స్కూళ్లను మాత్రం తెరిచేందుకు సిద్ధమైందని దుయ్యబట్టారు. పిల్లలకు కూడా బర్లు, గొర్లు ఇస్తే కాచుకుంటారని సెటైర్లు వేశారు. ప్రభుత్వానికి 12000 మంది విద్యావలంటీర్లు వద్దు, 1000 మంది అవర్లీ టీచర్లు వద్దు, 1700 మంది గెస్ట్ లెక్చరర్లు వద్దు కానీ స్కూళ్లు మాత్రం ప్రారంభించడం కావాలని షర్మిల మండిపడ్డారు.

Next Story