ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ

by  |
ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలలుగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్న పేద కళాకారుల పట్ల ఉప్పల ఫౌండేషన్ ఔదార్యాన్ని చాటింది. శనివారం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ వినతి మేరకు టీఆర్ఎస్ నేత, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో 100 మంది పేద కళాకారుల కుటుంబాలకు బిర్యానీ ప్యాకెట్లు, బత్తాయి పండ్లు, నిత్యావసరాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నామని, వినోదం పంచే కళాకారులకు కష్టం రావడం బాధాకరమని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు మాట్లాడుతూ ‘మా సిద్ధిపేటకు చెందిన బిడ్డ ఉప్పల శ్రీనివాస్ రాష్ట్ర నాయకుడిగా ఎదగడం గర్వ కారణమ‘న్నారు. గత 68రోజులుగా ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ తాను కోరిన వెంటనే పేద సినీ కళాకారులకు శ్రీనివాస్ గుప్తా సాయం అందించారని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఐవీఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉటుకూరి శ్రీనివాస్, ప్రొడ్యూసర్ జేవీఆర్, ట్రైబల్ సంఘ అధ్యక్షుడు శోభన్, సినీ హీరో కిరణ్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed