ఎంపీ విజయసాయిరెడ్డిపై అనర్హత పిటిషన్ కొట్టివేత

by  |
ఎంపీ విజయసాయిరెడ్డిపై అనర్హత పిటిషన్ కొట్టివేత
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొట్టివేశారు. అనర్హత వర్తించదని స్పష్టంచేస్తూ రాష్ట్రపతి కార్యాలయం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. లాభదాయక పదవి నిర్వహిస్తున్నారనే ఫిర్యాదుపై రాష్ట్రపతి కేంద్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయం తీసుకున్నారు. పార్లమెంటు అనర్హత నిరోధక చట్టం, న్యాయస్థానాల తీర్పు మేరకు అనర్హత వర్తించదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం మేరకు అనర్హత పిటిషన్‌ను కొట్టివేశారు. జీవో నంబర్ 75ప్రకారం ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఎటువంటి జీతభత్యాలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విధి నిర్వహణలో, ఏపీ పర్యటనలో కేవలం రాష్ట్ర అతిథిగా మాత్రమే ఉన్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed