దిశ ఎఫెక్ట్.. గబ్బిలాల స్థావరాలకు ఫారెస్ట్ అధికారులు

by  |
దిశ ఎఫెక్ట్.. గబ్బిలాల స్థావరాలకు ఫారెస్ట్ అధికారులు
X

దిశ , పెద్దపల్లి: గబ్బిలాల వేటపై దిశలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. పెద్దపెల్లి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేంద్రరావు సుల్తానాబాద్ మండలం రామునిపల్లెలోని గబ్బిలాల ప్రదేశం వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు. దిశ కథనానికి స్పందించి.. ఘటనా స్థలికి వచ్చినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌తో పాటు ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా గబ్బిలాల వేట కోసం వచ్చేవారు.. కనబడితే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. గబ్బిలాలను నాటు వైద్యంలో వాడతారని తెలుసుకున్న హంటర్స్ ఇప్పటి వరకు సుమారు 3వేల గబ్బిలాలు చంపి.. తీసుకువెళ్లినట్లు తెలిసింది. గబ్బిలాల రెట్టకు కూడా బాగా డిమాండ్ ఉండటంతో మహారాష్ట్ర, వరంగల్ నుంచి హంటర్స్ గబ్బిలాలను వేటాడేందుకు వస్తున్నారని, ప్రత్యేకమైన వలలు ఏర్పాటు చేసి గబ్బిలాలను వేటాడే వారని ప్రజలు తెలిపారు. దీంతో ఇక మీదట తగు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Next Story

Most Viewed