‘దిశ’ కథనం ఎఫెక్ట్.. దుగ్గొండి తహసీల్దార్‌గా సంపత్

by  |
tehsildar sampath
X

దిశ, దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండల తహసీల్దార్‌గా సంపత్ బాధ్యతలు స్వీకరించారు. గత ఐదు నెలల క్రితం దుగ్గొండి తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి బదిలీ అయ్యారు. దీంతో ఐదు నెలల నుంచి తహసీల్దార్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురుకుల ప్రవేశాల కోసం కుల, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం, వివిధ పనుల నిమిత్తం దుగ్గొండి మండల కార్యాలయానికి వచ్చి తహసీల్దార్ లేక అనేక నిరుత్సాహంతో వెనుదిరిగారు. చివరకు నర్సంపేటలోని ఇన్‌చార్జి తహసీల్దార్ రాంమ్మూర్తి వద్దకు రావాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో ‘తహశీల్దార్ లేక విధుల్లో జాప్యం.. ఇబ్బందుల్లో ప్రజలు’ అనే శీర్షికతో ‘దిశ’ సెప్టెంబర్ 30న కథనం వెలువడించింది. దీంతో ‘దిశ’ కథనంతో అధికారుల్లో అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంపత్‌ని దుగ్గొండి మండల తహసీల్దార్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Next Story