వెబ్ వెర్షన్లో ఇన్‌స్టాగ్రాం డైరెక్టు మెసేజింగ్ సర్వీసు

by  |
వెబ్ వెర్షన్లో ఇన్‌స్టాగ్రాం డైరెక్టు మెసేజింగ్ సర్వీసు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పట్నుంచో ఇన్‌స్టాగ్రాం వినియోగదారులు ఎదురుచూస్తున్న ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. వెబ్ వెర్షన్లో లాగిన్ అయ్యి డైరెక్టు మెసేజింగ్ చేసుకునే సర్వీసును తీసుకువచ్చింది. అయితే జనవరి మొదటివారం నుంచే ఇన్‌స్టాగ్రాం ఈ ఫీచర్‌ని కొంతమంది యూజర్లతో పరీక్షిస్తోంది. దీంతో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లలో కూడా డైరెక్టు మెసేజ్‌లను వీక్షించే, పంపించే అవకాశం కలిగింది.

ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురావడం వల్ల యూజర్ ఎంగేజ్‌మెంట్ అధికంగా పెరిగే అవకాశం ఉందని ఇన్‌స్టాగ్రాం అభిప్రాయపడింది. తమ ఉత్పత్తులన్నింటిని మరింత కమ్యూనికేషన్ ఫ్రెండ్లీగా చేయాలనే మార్క్ జుకర్‌బర్గ్ ఉద్దేశాన్నిఈ ఫీచర్ ప్రతిబింబిస్తోంది. కొవిడ్ 19 గురించి అవగాహన పెంచే ప్రయత్నంలో భాగంగా ఏప్రిల్ 10న ఈ ఫీచర్‌ను విడుదల చేశారు. ఎక్కువమంది సెలెబ్రిటీలు ఇన్‌స్టాగ్రాం ఉపయోగిస్తున్న నేపథ్యంలో వారి ద్వారా ఈ వైరస్ గురించి డైరెక్ట మెసేజ్‌ల రూపంలో అవగాహన కల్పించొచ్చు. ఇప్పటికే ఇందుకు సంబంధించి స్టే హోమ్ అనే స్టిక్కర్ ఇన్‌స్టాలో పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే.

Tags: India,Instagram, Direct Message, DM, Facebook, Corona



Next Story

Most Viewed