దేశమంతటా సులువైన వైద్యం.. 16 అంకెలతో డిజిటల్​ కార్డు

by  |
దేశమంతటా సులువైన వైద్యం..  16 అంకెలతో డిజిటల్​ కార్డు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ ప్రజల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందుబాటులోకి తేస్తున్న‘డిజిటల్​ హెల్త్​ కార్డు’ విధానంతో వైద్యం సులువుగా అందుతుందని వైద్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌లో భాగంగా గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం 6 రాష్ట్రాల్లో విజయవంతం కావడంతో మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు సర్వం సిద్ధమవుతున్నది. ఈ మేరకు ప్రతీవ్యక్తికి 16 అంకెల యూనిక్​ కోడ్​తో డిజిటల్​ కార్డును ఇవ్వనున్నారు. కేంద్రం రూపొందించిన డిజిటల్​ యాప్​, వెబ్​సైట్​లలో ఆ కోడ్​ ద్వారా దేశవ్యాప్తంగా ఏ ప్రాంతం నుంచైనా చికిత్స పొందవచ్చు.

ఆసుపత్రులకు వచ్చిన ప్రతీ పేషెంట్​ ఆధార్​కార్డు, ఫోన్​ నంబర్లను తీసుకొని హెల్త్ ఐడీ క్రియేట్‌ చేయించేలా ప్రభుత్వ, ప్రైవేట్​ హాస్పిటళ్లతో ప్రభుత్వం ఒప్పందం చేయనుంది. ఇదే తరహాలో ఇప్పటి వరకు కొన్ని రకాల స్కీంలు జరుగుతున్నా.. ఈ సారి హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు కూడా ఎన్‌హెచ్‌ఆర్‌‌ను(నేషనల్​ హెల్త్​ డిజిటల్​ రికార్డ్స్​) లింక్ చేయనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. బీమాను కలిగి ఉన్న వ్యక్తి హాస్పిటల్‌లో చేరగానే.. సదరు వ్యక్తి వివరాలన్నీ ఇన్సూరెన్స్‌ కంపెనీకి వెళ్లిపోతాయి.

క్లెయిమ్‌ కూడా ఆన్‌లైన్‌ విధానంలో పూర్తవుతోంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఐడీతో మన ఆరోగ్య పరిస్థితి, పాత రిపోర్టులు, మందులు వివరాలను సులువుగా తెలుసుకోవచ్చు. పేషెంట్​ ల కన్ఫర్మేషన్​ కోడ్​ తో డాక్టర్లు, ఇన్సూరెన్స్‌ కంపెనీలూ కూడా వివరాలు తెలుసుకోవచ్చు. దీంతో ఏ రాష్ట్రంలో ఏ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోవచ్చని ఎన్​హెచ్​ఎం ఆఫీసర్లు పేర్కొంటున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక ఫోకస్​ పెట్టవచ్చని వివరిస్తున్నారు.

Next Story

Most Viewed