పెండింగ్ కేసులపై డీఐజీ ఏవీ రంగనాథ్ దిశానిర్దేశం

by  |
DIG Ranganath
X

దిశ, నల్లగొండ : జిల్లాలో పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డీఐజీ ఏవీ రంగనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారుల పని చేయాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపించి వాటి సంఖ్యను తగ్గించేలా కృషి చేసిన అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

NLG Poilice

జిల్లాలో పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న క్రమంలో మంచి ఫలితాలు సాధిస్తున్నామని, ఇంకా పెండింగులో ఉన్న కేసులన్నింటినీ పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. ఇందుకోసం కోర్టుల్లో న్యాయమూర్తులతో చర్చించి కేసుల పురోగతి, విచారణ విషయాల్లో అధికారులంతా చురుకుగా పని చేయాలని సూచించారు. ఇదే సమయంలో కోర్టు కేసులలో శిక్షల శాతం మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నల్లగొండ జిల్లా గతంలో కోర్టు కేసులలో శిక్షల శాతం పెంచి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ మరింత సమర్థవంతంగా పని చేయాలని, జిల్లా అగ్రస్థానంలో నిలిచే విధంగా నిబద్ధతతో పని చేయాలన్నారు.

సమావేశంలో అదనపు ఎస్పీ సి.నర్మద, డీఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, ఆనంద్ రెడ్డి, రమణా రెడ్డి, సీఐలు సురేష్ కుమార్, గౌరు నాయుడు, నిగిడాల సురేష్, శేఖర్ రెడ్డి, నాగరాజు, శంకర్ రెడ్డి, శ్రీనివాస్, ఎస్ఐలు రాజశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed