Diwali 2023: ఈ వాస్తు చిట్కాలతో.. దీపావళి రోజు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది..! ప్రతికూల శక్తులనూ తొలగించుకోవచ్చు..

by Disha Web Desk 10 |
Diwali 2023: ఈ వాస్తు చిట్కాలతో.. దీపావళి రోజు  లక్ష్మీ కటాక్షం లభిస్తుంది..! ప్రతికూల శక్తులనూ తొలగించుకోవచ్చు..
X

దిశ,వెబ్ డెస్క్: దీపావళి పండుగ వచ్చేస్తోంది. ఈ పవిత్రమైన రోజును చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు సంతోషంగా జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల ధనలక్ష్మీ అనుగ్రహం లభిస్తుందని, అలాగే తమ ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని నమ్ముతుంటారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండే వారు దీపావళి పండుగ రోజున ఉపవాసం ఉంటారు. ఈ నేపథ్యంలో దీపాల పండుగ ఈసారి నవంబర్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరుపుకోనున్నారు. దీపావళి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని వాస్తు చిట్కాలను ఫాలో అవ్వాలి. వీటిని పాటించడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులు కచ్చితంగా లభిస్తాయని పండితులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

దీపావళి పండుగ వేళ ప్రతి మూలలోనూ మట్టి దీపాలనే వెలిగించాలి. ఇలా చేయడం వల్ల నర దిష్టి, ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. మట్టి దీపాల్లో దీపాలను వెలిగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. దీపాలను వెలిగించే సమయంలో దీపాల సంఖ్య 11, 21 మాత్రమే ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, దీపావళి, ధన త్రయోదశికి ముందు మీ ఇంట్లోని ఈశాన్య దిశను కచ్చితంగా శుభ్రం చేయాలి. ఎందుకంటే దీన్ని దేవతల ప్రత్యేక ప్రదేశంగా పరిగణిస్తారు. అలాగే పూజా గదిని శుభ్రం చేసిన తర్వాత ఒక గిన్నెలో నీటిని తీసుకుని దానిలో కొంచెం ఉప్పు కలిపి, ఇల్లంతా చల్లాలి. ఇలా చేస్తే .. ఆ ఉప్పు మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని గ్రహించి తొలగిస్తుంది.



Next Story

Most Viewed